జియో ప్రవేశంతో మొబైల్ సేవలను అతి చౌకగా ప్రజలందరికి చేరువ చేసిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. తాజాగా ఫైబర్ టు హోం సేవలను కూడా మరింత చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికం రంగంలో ఆధిపత్యం సాధించేందుకు ముందుకు సాగుతున్నారు.
ముంబై: రిలయన్స్ జియో ఫైబర్ టు ది హోం నెట్‌వర్క్‌ను విస్తరించే పనిలో పడింది. ఏకకాలంలో 1,600 పట్టణాల్లో దీనిని ప్రారంభించారు. ప్రపంచలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా ఇది పేరు తెచ్చుకొంది. ఇప్పుడు వచ్చే మూడేళ్లలో 7.5కోట్ల మంది వినియోగదారులను చేరడమే లక్ష్యంగా పెట్టుకొంది.
undefined
తొలివిడతలో భాగంతో 1100 పట్టణాల్లో 50 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను సాధించాలని ఇటీవల జరిగిన వాటాదారుల వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ లక్ష్యంగా పెట్టుకొన్నారు.
ప్రస్తుతం రిలయన్స్ జియోకు ప్రత్యర్థిగా ఉన్న భారతీ ఎయిర్ టెల్ సొంత ఫైబర్ టు హోం కింద రెండు కోట్ల యూజర్ల దరికి చేరాలని ప్రణాళికలు రూపొందించుకున్నది. వాణిజ్యపరంగా మార్కెట్‌లోకి విడుదల చేయడానికి ముందే 100 పట్టణాల్లో పరీక్షల నిమిత్తం జియో నెట్ వర్క్‌ను అందస్తోంది.
ఇది పూర్తైన మూడు నెలల తర్వాత వాణిజ్యపరంగా ఎఫ్‌టీటీహెచ్ సర్వీసును అందించనుంది. ఈ సర్వీసులను పూర్తిస్థాయిలో ప్రారంభించే విషయాన్ని మాత్రం జియో వివరించలేదు. ఫైబర్ టు హోం ద్వారా సేవలందించడంతోపాటు వైర్ లెస్ సేవలందించే విషయాన్ని కూడా రిలయన్స్ జియో పరిశీలిస్తోంది.
మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయడంతోనే రిలయన్స్ జియో 4జీ డేటాను వినియోగదారులకు ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 31.5 కోట్ల మంది కస్టమర్లతో అతిపెద్ద టెలికం ప్రొవైడర్ సంస్థగా రిలయన్స్ జియో నిలిచింది. అలాగే రెవెన్యూలోనూ 38 శాతం వాటా కలిగి ఉంది.
ఫైబర్ టు ది హోం టెక్నాలజీ సాయంతో లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు వైర్‌లెస్ తో సేవలందించడం చౌకగా ఉంటుంది. శరవేగంగా బ్రాడ్ బాండ్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఫైబర్ మార్గాలు వేయడానికి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. అంతేకాదు పైబర్ మార్గాలను సుగమం చేయాలంటే చలా కష్ట పడాల్సి వస్తుంది. ఫైబర్ టు ది హోం టెక్నాలజీ ఫ్యూచర్ ప్రూఫ్ బిజినెస్ ప్లస్ వన్ టైం ఇన్వెస్ట్‌మెంట్‌గా నిలుస్తుంది.