మీకు ఇష్టమైన పాట వినడానికి లిరిక్స్ గుర్తుండకపోవటంపై సమస్య ఉండదు. ఎందుకంటే 'YouTube Music' దీనికి ఒక పరిష్కారంతో ముందుకు వచ్చింది.
ఎక్కడో విన్న పాటలు మళ్ళీ వినాలని ఒక్కోసారి అనిపిస్తుంటుంది.. కానీ మ్యూజిక్ తప్ప లిరిక్స్ గుర్తుకు రావు.. మీరు అలంటి పాటల కోసం యూట్యూబ్ లో వెతుకుతుంటారు. ఈ పరిస్థితి చాలా మందికి ఎదురవవచ్చు. కానీ దీనికో పరిష్కారం ఉంది. మీకు ఇష్టమైన పాట వినడానికి లిరిక్స్ గుర్తుండకపోవటంపై సమస్య ఉండదు. ఎందుకంటే 'YouTube Music' దీనికి ఒక పరిష్కారంతో ముందుకు వచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే Google అసిస్టెంట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది మరింత అప్ డేటెడ్ అండ్ YouTube మ్యూజిక్ కోసం తీసుకొచ్చారు.
"ప్లే, సింగ్ లేదా హమ్ ఎ సాంగ్" ఫీచర్ యాపిల్ 'Shazam' లాగ పనిచేస్తుంది, దీనికి ఎటువంటి లిరిక్స్ అవసరం లేదు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్‌లలో YouTube Musicలో అందుబాటులో ఉంది. మీకు నచ్చిన పాటను డివైజ్లో 'ప్లే' చేయండి, పాడండి లేదా మెలోడీని హమ్ చేయండి... పాట రెడీగా ఉంటుంది. యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో ఈ ఫీచర్‌ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా, పాటలను గుర్తించి ఒకే యాప్‌లో ప్లే చేయవచ్చు.
ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి అని ఆలోచిస్తున్నవారు ఒక విషయం గమనించాలి. ముందుగా Android ఫోన్‌లో YouTube అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి. పైన కుడి వైపున సెర్చ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఆపై మీరు మ్యూజిక్ ఐకాన్‌తో ఉన్న బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా పాటను ప్లే చేయవచ్చు, పాడవచ్చు లేదా హమ్ చేయవచ్చు. ఐదు నుండి 10 సెకన్లలో పాట గుర్తింస్తుంది ఇంకా సెర్చ్ రిజల్ట్స్ స్క్రీన్‌పై చుపిస్తుంది. ఇలా కనిపెట్టిన పాటలను యాప్ ద్వారానే వినడం విశేషం.