Latest Videos

ట్విట్టర్లో పోయింది.. వాట్సాప్‌లో వచ్చింది.. ఈ కొత్త ఫీచర్ ఏమిటంటే..

By Ashok kumar SandraFirst Published Jun 7, 2024, 6:47 PM IST
Highlights

మెటా వెరిఫైడ్ బ్యాడ్జిస్ వాట్సాప్ బిజినెస్‌ ఆకౌంట్కి  వస్తున్నాయి. భారత్‌తో పాటు బ్రెజిల్, ఇండోనేషియా ఇంకా కొలంబియాలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వెరిఫైడ్ బ్యాడ్జ్ మెటాతో సమాచారాన్ని రిజిస్టర్ చేసిన బిజినెస్  అకౌంట్లో కనిపిస్తుంది. 

సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ భారత్‌తో సహా పలు దేశాల్లో ఓ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ఏమిటంటే వాట్సాప్ బిజినెస్ యాప్ ఇప్పుడు మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌ పొందుతుంది. బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగిన అన్యువల్  బిజినెస్ సమావేశంలో మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ కొత్త ఫీచర్లను పరిచయం చేశారు.  

మెటా వెరిఫైడ్ బ్యాడ్జిస్ వాట్సాప్ బిజినెస్‌ ఆకౌంట్కి  వస్తున్నాయి. భారత్‌తో పాటు బ్రెజిల్, ఇండోనేషియా ఇంకా కొలంబియాలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వెరిఫైడ్ బ్యాడ్జ్ మెటాతో సమాచారాన్ని రిజిస్టర్ చేసిన బిజినెస్  అకౌంట్లో కనిపిస్తుంది. ఇలాంటి వెరిఫైడ్ బిజినెస్ వాట్సాప్ అకౌంట్స్  నమ్మకాన్ని  పెంచుతాయని మెటా లెక్కిస్తోంది. బ్లూ టిక్ అండ్ మెట్టా వెరిఫైడ్‌ వాట్సాప్ బిజినెస్ పేజీలు, ఛానెల్‌లలో కనిపిస్తాయి, ఇది మెటా ఇతర యాప్స్  Facebook, Instagramలో కనిపిస్తుంది. మరో ఫీచర్ ఏమిటంటే, ప్రతి ఒక్కరు అన్ని వాట్సాప్ అకౌంట్లో వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్లను ఉపయోగించవచ్చు. 

WhatsApp బిజినెస్ అకౌంట్స్  పై నమ్మకం అనేది మెటా కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్య. వెరిఫైడ్  అకౌంట్స్  రాకతో, కంపెనీలు, వ్యక్తులు తమ వ్యాపారాన్ని  మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నారు. కస్టమర్లు  కొత్త ప్రొడక్ట్స్  కనుగొనడంలో సహాయపడే AI టూల్స్ తో WhatsApp బిజినెస్  అకౌంట్స్  ఉంటాయి. META ప్రస్తుతం దీనికి సంబంధించిన టెక్నాలజీపై పని చేస్తోంది. 

click me!