ఫోన్ నంబర్ల కొత్త సిరీస్; ఇప్పుడు 160తో మొదలు..

By Ashok kumar SandraFirst Published May 31, 2024, 10:43 PM IST
Highlights

ఫోన్ కాల్స్ ద్వారా జరిగే మోసాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ సిరీస్ 160 నంబర్లతో  మొదలవుతుంది. 

న్యూఢిల్లీ: టెలికాం మంత్రిత్వ శాఖ ఇండియాలో 10 అంకెల మొబైల్ నంబర్ల కొత్త సిరీస్‌ను ప్రవేశపెడుతోంది. ఈ సిరీస్ 160 నంబర్లతో  మొదలవుతుంది. మార్కెటింగ్ ఇంకా సర్వీస్ కాల్స్ కోసం కొత్త 160 సిరీస్ నంబర్‌లను ప్రారంభించనున్నట్లు టెలికాం మంత్రిత్వ శాఖ పేర్కొంది అని  టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఈ 10-అంకెల నంబర్ సిరీస్ టెలికాం కస్టమర్‌లు కాలింగ్ ఎంటిటీ, టెలిఫోన్ ఆపరేటర్ ఇంకా  ఫోన్ కాల్  లొకేషన్ ఖచ్చితంగా తెలుసుకునేలా రూపొందించబడింది.

టెలికాం మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, సర్వీస్  అండ్  ట్రాన్సాక్షనల్  ఫోన్ కాల్స్  కోసం 160తో ప్రారంభమయ్యే నంబర్‌లను అందించాలని నిర్ణయించారు. ఫోన్ కాల్స్ ద్వారా మోసాలను తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాల్స్  పొందిన  వారు ప్రభుత్వ సంస్థల నుండి వచ్చిన కాల్స్ ఆ లేదా రేగులేటేడ్  సంస్థల నుండి వచ్చినవా లేదా ప్రభుత్వ అధికారులుగా చెప్తూ  మోసగాళ్ల నుండి వచ్చిన కాల్స్ ఆ అనేది మరింత స్పష్టంగా గుర్తించడానికి ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు కూడా 1600ABCXXX ఫార్మాట్‌లో నంబర్‌లను పొందవచ్చు. దీనిలో AB టెలికాం సర్కిల్ కోడ్‌ని సూచిస్తుంది. C అనేది టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కోడ్. చివరి మూడు XXX 000-999 మధ్య ఉన్న నంబర్లు. 

Latest Videos

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇంకా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ వంటి వివిధ ఆర్థిక సంస్థలకు 1601ABCXXX ఫార్మాట్‌లో 10-అంకెల నంబర్  కూడా జారీ చేయబడుతుంది. 160 సిరీస్ నంబర్‌లను జారీ చేసే ముందు ఎంటిటీల వెరిఫికేషన్ బాధ్యత టెలికాం సర్వీస్ ప్రొవైడర్లదే.   

click me!