పెద్ద ప్లానే: జియో కొత్త యాప్‌.. ఇప్పుడు అన్ని ఒకే చోట..

By Ashok kumar Sandra  |  First Published May 30, 2024, 6:57 PM IST

Jio Financial Services Ltd. ఈరోజు JioFinance యాప్‌ను లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఈ యాప్‌ను ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. జియో ఫైనాన్స్ యాప్ అత్యాధునిక ప్లాట్‌ఫారమ్ అని కంపెనీ  ప్రకటనలో తెలిపింది. ఈరోజు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఒక్కో షేరుకు రూ.348 వద్ద ముగిశాయి.  
 


 న్యూఢిల్లీ: బిలియనీర్, ఆసియ అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈరోజు జియో ఫైనాన్స్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం కంపెనీ ఈ యాప్‌ను బీటా వెర్షన్‌లో విడుదల చేసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, జియో ఫైనాన్స్ యాప్ అత్యాధునిక ప్లాట్‌ఫారమ్ అని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ యాప్ డైలీ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్ రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది.

Latest Videos

undefined

 జియో ఫైనాన్స్ యాప్ ఎందుకు ప్రత్యేకమైనది? 
జియో ఫైనాన్స్ మీడియా విడుదల ప్రకారం, జియో ఫైనాన్స్ యాప్ డిజిటల్ బ్యాంకింగ్, యుపిఐ ట్రాన్సక్షన్స్, క్లెయిమ్ సెటిల్‌మెంట్, ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ వంటి వాటిలో సహాయపడుతుంది.

ఈ యాప్‌కు సంబంధించి జియో ఫైనాన్స్ ప్రతినిధి మాట్లాడుతూ కస్టమర్ల సౌకర్యార్థం ఈ యాప్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది అని  ఆన్నారు. ఒకరి ఫైనాన్సియల్  మెయింటెనెన్స్   విధానాన్ని నిర్వచించడం ఈ యాప్ ఉద్దేశ్యం. అంతే కాకుండా, కస్టమర్లు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అన్ని ఫైనాన్స్ సంబంధిత సౌకర్యాలను పొందుతారని మేము కోరుకుంటున్నాము.

ఈరోజు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఒక్కో షేరుకు రూ.348 వద్ద ముగిశాయి.

click me!