ఆధార్, పాస్‌పోర్టు కోసం కొత్త రూల్‌.. ఇప్పుడు అంత ఈజీ కాదు..

By Ashok kumar Sandra  |  First Published Dec 21, 2023, 7:21 PM IST

UIDAI ఇప్పుడు ఆధార్ కార్డు పొందడానికి కొత్త ఇంకా కఠినమైన నిబంధనలను అమలు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారు కొత్త ఆధార్ కార్డు పొందడం అంత సులభం కాదు.
 


ఇండియాలో 18 ఏళ్లు పైబడిన వారు ఆధార్ కార్డు పొందేందుకు యూఐడీఏఐ(UIDAI ) కొత్త నిబంధనను అమలు చేసింది. సులభంగా అందుబాటులో ఉండే ఆధార్ కార్డు ఇప్పుడు పాస్‌పోర్ట్ వంటి మల్టి లెవెల్ వెరిఫికేషన్ తప్పనిసరి. పాస్‌పోర్ట్  అడ్రస్ కు చేరుకున్న తర్వాత వెరిఫికేషన్  చేయబడుతుంది. 

బంగ్లాదేశ్, మయన్మార్‌తో సహా అనేక సరిహద్దు ప్రాంతాల నుండి చాలా మంది అక్రమంగా భారతదేశంలోకి చొరబడి మొదట ఆధార్ కార్డును పొందుతారు. ఆధార్ కార్డు అందరికీ సులభంగా అందుబాటులో ఉండేది. దేశ భద్రత సవాల్‌గా మారుతున్న తరుణంలో ఆధార్ కార్డులో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.

Latest Videos

UIDAI ఇప్పుడు ఆధార్ కార్డు పొందడానికి కొత్త ఇంకా కఠినమైన నిబంధనలను అమలు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారు కొత్త ఆధార్ కార్డు పొందడం అంత సులభం కాదు.

కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు పొందేందుకు పాస్‌పోర్టు తరహా వెరిఫికేషన్‌ను చేపట్టనున్నారు. అధికారులు వచ్చి మీరు ఆధార్ కార్డు కోసం ఇచ్చిన చిరునామాను వెరిఫై చేస్తారు.

పాస్‌పోర్ట్ పొందే ముందు మీ అడ్రస్ పోలీసు వెరిఫికేషన్  చేయబడుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డు పొందేందుకు నోడల్ అధికారులు అడ్రస్  వెరిఫికేషన్  చేస్తారు.

UIDAI ఇప్పుడు ప్రతి జిల్లా ఇంకా తాలూకా కేంద్రానికి నోడల్ అధికారులను నియమిస్తుంది. ఈ అధికారుల బృందం ఆధార్ కార్డు అడ్రస్ చెక్ చేస్తుంది.

చిరునామా, వయస్సుతో సహా అన్ని డాకుమెంట్స్ వెరిఫై చేయబడతాయి. UIDAI పోర్టల్ ద్వారా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కనీసం 180 రోజులు పడుతుంది.

2010లో ఆధార్ ఎంట్రీ ప్రారంభమైంది. ఇప్పుడు ఆధార్ కార్డ్ అడ్రస్, 10 సంవత్సరాల కంటే ముందు ఉన్న ఫోటోతో సహా కొన్ని డాకుమెంట్స్  అప్‌డేట్ చేయడం తప్పనిసరి

ఆధార్ అప్‌డేట్ తేదీ గడువు మార్చి 24, 2024 వరకు పొడిగించబడింది. UIDAI ఆధార్ కార్డ్ డేటాను చెక్  చేసి అప్‌డేట్ చేయాలని అభ్యర్థించింది.

click me!