QR కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండీ..

By Ashok kumar Sandra  |  First Published Dec 21, 2023, 7:07 PM IST

ఇటీవలి కాలంలో క్యూఆర్‌కోడ్‌ మోసాలు ఎక్కువయ్యాయి. కాబట్టి QR కోడ్‌ను స్కాన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం లేదంటే  మీరు డబ్బును కోల్పోతారు. 
 


 నేడు చిన్న కొనుగోళ్లకు కూడా యూపీఐ చెల్లింపులు చేయడం సర్వసాధారణం. ఇంతకుముందులా పర్సులోనో, జేబులోనో నగదు పెట్టుకుని ఎవరూ తిరగట్లేదు. దీనికి బదులుగా ఈ రోజు భారతదేశంలోని ప్రజలు వారి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌తో ఏదైనా కొనగలమనే నమ్మకంతో ఉన్నారు. సింపుల్ గా  చెప్పాలంటే నేడు డిజిటల్ చెల్లింపు వ్యవస్థ దేశంలో ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసింది.

కూరగాయలు కొనుగోలు చేసినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లిస్తాం. అలాగే, మీరు కొన్ని వెబ్‌సైట్‌లు లేదా కొన్ని షాపుల్లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు, మీరు ఇ-మెయిల్ ద్వారా QR కోడ్‌ని పంపవచ్చు లేదా కొన్ని సైట్‌లలో QR కోడ్‌ని స్కాన్ చేసి చెల్లించవచ్చు. అయితే, క్యూఆర్ కోడ్ తెలియని ఆన్‌లైన్ సైట్‌లలో స్కాన్ చేస్తే డబ్బు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్ స్కామ్ ద్వారా మోసగాళ్లు పెరిగిపోతున్నారు.

Latest Videos

undefined

QR కోడ్ మోసం అంటే ఏమిటి?
వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి మోసగాళ్లు QR కోడ్‌లలో ప్రమాదకరమైన లింక్‌లను దాచిపెడతారు. అందువల్ల, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అమెరికన్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి) హెచ్చరించింది. మరికొందరు QR కోడ్‌ని మెసేజ్ లేదా ఇ-మెయిల్ ద్వారా పంపుతారు అలాగే  కొన్ని కారణాలతో QR కోడ్‌ను స్కాన్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. తాజాగా  క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని చోరీ చేస్తున్న ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సైబర్ మోసగాళ్లు మీ అకౌంట్  నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ఈ వివరాలను ఉపయోగిస్తారు. అమెరికా సహా అనేక దేశాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి.

QR కోడ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
1. మీరు ఊహించని లేదా పరిచయం లేని ప్రదేశాలలో QR కోడ్‌ని స్కాన్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. లింక్‌ల ద్వారా QR కోడ్‌ని స్కాన్ చేస్తున్నప్పుడు URLని గుర్తించండి.  మారిన అక్షరాలు లేదా తప్పు అక్షరాలు  ఉంటే జాగ్రత్తగా ఉండండి.

2. ఇ-మెయిల్ లేదా టెక్స్ట్  మెసేజ్ లో వచ్చిన QR కోడ్‌ని స్కాన్ చేయవద్దు. ముఖ్యంగా ఎవరైనా వెంటనే చేయమని పట్టుపడితే, అస్సలు చేయకండి. మీరు అందుకున్న మెసేజ్ అఫీషియల్  సోర్స్ నుండి వచ్చినదని మీరు భావిస్తే, సంబంధిత వ్యక్తిని సంప్రదించి, తరువాత QR కోడ్‌ను స్కాన్ చేయండి.

3. మీ మొబైల్ అండ్ అకౌంట్స్ ని ప్రొటెక్షన్ చేయండి. హ్యాకర్లను నివారించడానికి మీ మొబైల్ OSని అప్‌డేట్ చేయండి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు లేదా మల్టి-ఫాక్టర్ అథేన్తికేషన్ తో మీ ఆన్‌లైన్ అకౌంట్స్ సురక్షితంగా ఉంచండి.

4. మీకు తెలిసిన వారి నుండి మీరు QR కోడ్‌ని అందుకున్నారని మీరు భావిస్తే, కన్ఫర్మ్ చేసుకోవడానికి వారిని ఫోన్‌లో సంప్రదించండి.

5. మీరు ఏదైనా స్టోర్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో QR కోడ్‌ని స్కాన్ చేస్తుంటే అసలు కోడ్‌లో ఎటువంటి మార్పు లేదని గమనించండి. అంటే సోర్స్ కోడ్ మొదలైన వాటిపై అతికించిన స్టిక్కర్.

6. QR కోడ్‌కి దారితీసే వెబ్‌సైట్‌లో లాగిన్, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎంటర్  చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  

click me!