ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు.. ఆర్కుట్‌ని మళ్ళీ తీసుకురావాలని కోరిన నెటిజన్లు..

By asianet news telugu  |  First Published Nov 19, 2022, 3:07 PM IST

ఇప్పుడు, ట్విట్టర్  'పతనం' గురించి మిమ్స్ కాకుండా, నెటిజన్లు Orkut అండ్ MySpace వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. Orkut అనేది మొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి.


టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ఉద్యోగులను ఎక్కువ గంటల పాటు పని చేయలని చెప్పడం తీవ్రమైన చర్యగా కనిపిస్తోంది. ఈ ప్రకటన తర్వాత ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులు  రాజీనామాలను అందించారు.  దీంతో ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ సైట్  భావిష్యత్తు గురించి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

నివేదికల ప్రకారం, చాలా మంది ప్రముఖులు  ట్విట్టర్ యాప్ ని వెళ్లిపోవడంతో ట్విట్టర్ నెమ్మదిగా ఫాలోవర్లను కోల్పోతోంది. అయినప్పటికీ,  ఎలోన్ మస్క్  అసాధారణ నిర్ణయాలను అడ్డుకోలేదు. టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, ఎలోన్ మస్క్  $8 బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్  ప్రారంభించారు.

Latest Videos

undefined

ఇప్పుడు, ట్విట్టర్  'పతనం' గురించి మిమ్స్ కాకుండా, నెటిజన్లు Orkut అండ్ MySpace వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. Orkut అనేది మొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి.

ఈ యాప్‌తో ఒకరు స్నేహితులకు టెస్టిమోనియల్‌లు, మెసేజెస్ అండ్ ఫోటోలను సెండ్ చేయవచ్చు. సింపుల్ గా ఉన్నప్పటికీ, ఇది చాలా సరదాగా ఉంటుంది. దీంతో ట్విట్టర్ యూజర్లు ఆ రోజులను ఎక్కువగా కోల్పోతున్నట్లు తెలుస్తుంది. చాలామంది Orkut ప్రొఫైల్ స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేశారు.

Orkut అనేది Google యాజమాన్యంలోని అండ్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్. ఆర్కుట్ ని Orkut Buyukkokten క్రియేట్ చేశారు ఈ సైట్  యువకులలో ఎంతో ప్రాచుర్యం పొందింది. దురదృష్టవశాత్తూ యూజర్లలో గణనీయమైన తగ్గుదల కారణంగా, Orkut 2014లో మూసి వేయబడింది.

click me!