Netflix Price: సబ్​స్క్రిప్షన్ ధరలు తగ్గించే యోచనలో నెట్​ఫ్లిక్స్.. కారణం ఇదే..!

By team telugu  |  First Published Apr 21, 2022, 11:19 AM IST

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు వ్యూహం మార్చుతోంది. సబ్‌స్క్రైబర్లను నిలుపుకునేందుకు మార్కెటింగ్ స్ట్రాటెజీ మార్చక తప్పడం లేదని చెబుతోంది. ఈసారి నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్స్‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.
 


కావాల్సినంత కంటెంట్, అధిక నాణ్యత నెట్‌ఫ్లిక్స్ సొంతం. కానీ దాని సబ్‌స్క్రిప్షన్ ఖర్చు మాత్రం గట్టిగానే ఉంటుంది. ఇతర ఓటీటీ సబ్​స్క్రిప్షన్స్​తో పోల్చితే.. నెట్​ఫ్లిక్స్​ ధరలు ఎక్కువే. అందుకే ఈ ప్లాట్​ఫామ్​కి సబ్​స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. ఈ క్రమంలోనే.. సబ్​స్క్రైబర్లను నిలుపుకోవడానికి నెట్​ఫ్లిక్స్ సంస్థ సబ్​స్క్రిప్షన్​ ఖర్చు తగ్గించాలని ప్రణాళికలు చేస్తుంది. 

నెట్​ఫ్లిక్స్ కన్నా తక్కువ ధరకే అమేజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ వంటి ఓటీటీలు యూజర్లకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ కారణం వల్లనే.. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లు వేగంగా తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ల ధరను తగ్గించడానికి కొత్త ప్లాన్‌లు వేస్తుంది. అప్పుడప్పుడు కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలను ప్రసరించాలనే ఆలోచనలో ఉంది.

Latest Videos

undefined

యూట్యూబ్​ లాగా ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించాలని నెట్​ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. అంటే సబ్‌స్క్రిప్షన్ ఖర్చులపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని భావిస్తోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ దాదాపు 2,00,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీంతో కంపెనీ షేర్లు 26 శాతం పతనమయ్యాయి. 2022-23లో నెట్‌ఫ్లిక్స్ 2 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  నెట్‌ఫ్లిక్స్ గత జనవరిలో నివేదించినట్లుగా.. భారతదేశంలో వ్యాపారం చేయడం చాలా సవాలుగా ఉంది. పైగా ఇప్పుడు పెద్ద సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ వినియోగం, చౌకైన ఇంటర్నెట్ కారణంగా.. నెట్‌ఫ్లిక్స్ తన మార్కెట్ గురించి మరింత ఆందోళన చెందుతోంది.

అన్ని ఓటీటీ వేదికల్లో నెట్‌ఫ్లిక్స్ కాస్త ప్రత్యేకం. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రకటనలుండవు. వినోదమే ప్రాధాన్యత. ఇదే ఆ సంస్థ ఉద్దేశ్యం కూడా. అయితే ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పలకనుంది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. త్వరలో సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటెజీతో రానుంది. గత కొద్దికాలంగా నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2 లక్షల మంది చందాదారుల్ని కోల్పోయింది. ఇది ఆ సంస్థకు ఊహించని షాక్. భారీగా చందాదారుల్ని కోల్పోవడం వెనుక కారణాల్లో ఆ సంస్థ ప్యాకేజ్ ప్రైసింగ్ ఒకటని తెలుస్తోంది. మిగిలిన వాటితో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కాస్త ఎక్కువే ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రకటనలు ఉండకపోవడంతో చందాదారుడు చెల్లించాల్సిన ధర ఎక్కువుంటుంది. బహుశా ఈ కారణంతో చాలామంది చందాదారులు జారుకుని ఉండవచ్చని తెలుస్తోంది. అందుకే ఈసారి కంపెనీ వ్యూహం మార్చనుంది. 

చందాదారుల్ని నిలుపుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు చౌక‌ప్లాన్స్ ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. చౌక  ప్లాన్స్ ప్రవేశపెట్టాలంటే..ఆర్ధికంగా దెబ్బతినకుండా ప్రకటనలు ఆహ్వానించాల్సి వస్తుంది. ఇక నుంచి నెట్‌ఫ్లిక్స్ ప్రకటనలతో కూడిన చౌక ప్లాన్స్ ప్రవేశపెట్టనుంది. 2022 జనవరి-మార్చి మధ్య 2 లక్షలమంది సబ్‌స్క్రైబర్లను సంస్థ కోల్పోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మరో 2 లక్షలమంది తగ్గవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. చందాదారులు తగ్గడంతో మొన్న తాజాగా నెట్‌ఫ్లిక్స్ షేర్ 26 శాతం తగ్గిపోయింది. దాంతో కంపెనీ నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. కొత్తగా చందాదారుల్ని ఆకర్షించేందుకు , ఉన్నవారిని నిలుపుకునేందుకు చౌక ప్లాన్స్ తప్పదని నిర్ణయించింది.

click me!