సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎలా పని చేస్తాయి.. అల్గారిథమ్‌ను పబ్లిక్ చేసిన కూ యాప్..

By asianet news telugu  |  First Published Apr 20, 2022, 7:31 PM IST

ఈ అల్గారిథమ్‌లు యూజర్ల  ప్రవర్తన, ప్రాధాన్యతల ఆధారంగా వారి అనుభవాలను అనుకూలీకరించడానికి, ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడే మ్యాథ్స్ నియమాల సెట్.
 


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని ఉపయోగిస్తుంటారు, అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎలా చేస్తాయి అని ఎవరైనా అడిగితే ఏంటి మీ సమాధానం.. ఏ యూజర్ టైమ్‌లైన్‌లో ఎలాంటి కంటెంట్ చూపించాలో, ఏ యూజర్ కు ఏ ప్రకటనలు చూపించాలో ఎలా నిర్ణయిస్తుంది ? దీనికి సంబంధించి  ఎవరి దగ్గర సమాధానం ఉండదు. 

చారిత్రాత్మక దశలో దేశీయ కూ( Koo)యాప్  ఒరిజినల్ అల్గారిథమ్‌లను పబ్లిక్ చేసింది. ఈ స్వదేశీ యాప్ దాని అల్గారిథమ్‌లను, ఇంకా ఎలా పని చేస్తుందో పరిచయం చేస్తూ మొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా మారింది. ఈ చర్య ద్వారా యూజర్ ప్రయోజనాలపై దృష్టి సారించి అలాగే ఈ ప్లాట్‌ఫారమ్  పారదర్శకత పట్ల కూ  యాప్ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. 

Latest Videos

undefined

యూజర్ ఏదైనా కంటెంట్‌ను ఎందుకు చూస్తున్నారో తెలుసుకోవడానికి  యూజర్లకు అధికారం ఇస్తుంది. ఈ అల్గారిథమ్‌ల పారదర్శకత  చర్య మార్చి 2022 నుండి జరుగుతోంది. ఈ అల్గారిథమ్‌లు యూజర్ల ప్రవర్తన, ప్రాధాన్యతల ఆధారంగా వారి అనుభవాలను అనుకూలీకరించడానికి, ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడే మ్యాత్స్ రూల్స్ సెట్. ఈ అల్గారిథమ్‌ల ప్రాథమిక సూత్రం యూజర్ల ఔచిత్యాన్ని ప్రోత్సహించడం. 

యాప్ ఫీడ్, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు (#), రికమెండేషన్స్, నోటిఫికేషన్‌లు వంటి నాలుగు ప్రధాన అల్గారిథమ్‌ల కీలక వేరియబుల్స్ గురించి Koo చర్చిస్తుంది. ఈ నాలుగు అల్గారిథమ్‌లు యూజర్లు చూసే, ఉపయోగించే కంటెంట్ రకాన్ని నిర్ణయిస్తాయి.

ఈ విషయంలో కూ యాప్ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్కా మాట్లాడుతూ, “మేము మా ప్రధాన వాటాదారులపై అంటే యూజర్లు, క్రియేటర్స్ పై చాలా దృష్టి పెడుతున్నాము. సరైన క్రియేటర్స్ కనుగొనడంలో యూజర్లకు సహాయం చేయడం ఇంకా సరైన యూజర్లను చేరుకోవడంలో  చాలా ముఖ్యం. మా అల్గారిథమ్‌లు దీన్ని సాధించడంలో సహాయపడతాయి ఇంకా యూజర్ల ఔచిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నో అనుభవాలను అనుకూలీకరించవచ్చు. మేము పారదర్శకతను మా విశ్వాసంగా తీసుకుంటాము. మా అల్గారిథమ్‌లను పబ్లిక్ చేయడం ద్వారా, మేము రిలవన్స్ ఎలా నడిపిస్తామో యూజర్లకు వివరించడానికి మేము ఒక అడుగు దగ్గరగా వేస్తున్నాము అని అన్నారు.
 

click me!