Redmi 10A : రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఈరోజే లాంచ్.. ధర ఎంతంటే..?

By team telugu  |  First Published Apr 20, 2022, 4:33 PM IST

ప్రముఖ సంస్థ షావోమీ (Xiaomi) నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. రూ.9వేలలోపు ధరతో రెడ్‌మీ 10ఏ (Redmi 10A) మొబైల్‌ లాంచ్ అయ్యింది. భారత్‌లో Redmi 10A ఫోన్‌ను బుధ‌వారం విడుదల చేసిన‌ట్లు షావోమీ అధికారికంగా ప్రకటించింది. చైనాలో గత నెల విడుదలైన ఈ మొబైల్‌.. అదే స్పెసిఫికేషన్లతో ఇక్కడికి వచ్చింది. 


ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ Redmi నుంచి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో బుధవారం (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయింది. అదే.. Redmi 10A స్మార్ట్ ఫోన్.. ఇండియాలో సరసమైన ధరకే అందుబాటులోకి రానుంది. నెల క్రితమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో రిలీజ్ అయింది. Redmi 10A బడ్జెట్ ఫోన్.. ఇప్పటికే Amazon వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేసింది. Redmi 10A స్మార్ట్ ఫోన్.. వాటర్డ్ డౌన్ వెర్షన్‌గా రానుంది. MediaTek Helio G25 ప్రాసెసర్, 13-MP ప్రైమరీ కెమెరాతో పాటు ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లతో వస్తోంది. Redmi 10A బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో ఏయే ఫీచర్లు ఉన్నాయి.. మార్కెట్లో ఈ డివైజ్ ధర ఎంత ఉండొచ్చునేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. స్పెసిఫికేషన్‌లను చూద్దాం.

Redmi 10A ధర

Latest Videos

భార‌త్‌లో రెండు వేరియంట్లలో రెడ్‌మీ 10ఏ విడుదలైంది.3GB RAM + 32GB స్టోరేజ్‌ రూ. 8,499, 4GB RAM + 64GB స్టోరేజ్ ఉన్న స్మార్ట్ ఫోన్‌ రూ. 9,499. దీని సేల్ ఏప్రిల్ 26న ప్రారంభం కానుంది.


Redmi 10A స్పెసిఫికేషన్‌లు

Redmi 10A బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 720×1600 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G25 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. ఇందులో స్టోరేజీ పెంచుకునే ఫెసిలిటీ ఉండకపోవచ్చు. ఇక Redmi 10A స్మార్ట్ ఫోన్.. Android 11 ఆధారిత MIUI 12.5 కస్టమ్ స్కిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కెమెరా ముందు భాగంలో.. Redmi 10A 13MP కెమెరాతో పాటు LED ఫ్లాష్‌ కలిగి ఉంది. సెల్ఫీల కోసం.. ముందు భాగంలో 5-MP కెమెరా ఉంది. ఫోన్ బాక్స్‌లో 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. వెనుకకు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, మైక్రో USB పోర్ట్ GPS వంటి ఫీచర్లను కలిగి ఉంది.


 

click me!