సి‌ఈ‌ఓ పదవికి నెట్‌ఫ్లిక్స్ కో-ఫౌండేర్ రాజీనామా.. ఇదే సరైన సమయమని అంటూ.. వారికి బాధ్యతల అప్పగింత..

By asianet news teluguFirst Published Jan 21, 2023, 11:45 AM IST
Highlights

టెడ్ సరండోస్ అండ్ గ్రేస్ పీటర్స్ నెట్‌ఫ్లిక్స్ కొత్త CEOలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు, అలాగే రీడ్ హేస్టింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటారు.  నెట్‌ఫ్లిక్స్ లోని ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయి. కరోనా కాలంలో (జూలై 2020) కంపెనీకి సవాలుగా ఉన్న సమయంలో పీటర్స్, సరండోస్‌లు పదోన్నతి పొందారు

యుఎస్ స్ట్రీమింగ్ దిగ్గజం, ఓ‌టి‌టి ప్లాట్‌ఫారమ్   నెట్‌ఫ్లిక్స్ (Netflix Inc.) సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూనే.. ఈ‌ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని అన్నారు. ఇప్పుడు లాంగ్ పార్ట్నర్ అండ్ కో-సి‌ఈ‌ఓ టెడ్ సరండోస్,   గ్రెగ్ పీటర్స్‌కు కంపెనీ బాధ్యతలను అప్పగించారు.

టెడ్ సరండోస్ అండ్ గ్రేస్ పీటర్స్ నెట్‌ఫ్లిక్స్ కొత్త CEOలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు, అలాగే రీడ్ హేస్టింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటారు.  నెట్‌ఫ్లిక్స్ లోని ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయి. కరోనా కాలంలో (జూలై 2020) కంపెనీకి సవాలుగా ఉన్న సమయంలో పీటర్స్, సరండోస్‌లు పదోన్నతి పొందారు

"మా బోర్డు చాలా సంవత్సరాలుగా సక్సేషన్ ప్లానింగ్ గురించి చర్చిస్తోంది" అని హేస్టింగ్స్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు.

2022లో నెట్‌ఫ్లిక్స్ షాక్‌
 నెట్‌ఫ్లిక్స్ 2022 ప్రథమార్థంలో భారీగా యూజర్లను కోల్పోయింది. కానీ సెకండాఫ్‌లో పెరుగుదల నమోదు చేసింది కానీ స్పీడ్ ఇంకా నెమ్మదిగానే ఉంది. నెట్‌ఫ్లిక్స్ కంపెనీకి ప్రయోజనం చేకూర్చడానికి దాని విధానాన్ని కూడా మార్చింది, గత నవంబర్‌లో 12 దేశాలలో చౌకైన, యాడ్- సపోర్ట్ ఆప్షన్ పరిచయం చేసింది. పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టేందుకు ప్లాన్ ను కూడా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ వాటాదారులకు 2022 కఠినమైన సంవత్సరంగా ఉండబోతోందని లేఖ కూడా రాసింది.  

 నెట్‌ఫ్లిక్స్ అన్ని రికార్డులను బ్రేక్
మరోవైపు, గురువారం (జనవరి 19) అన్ని రికార్డులను బద్దలు కొడుతూ, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 230 మిలియన్లకు పైగా పెరిగింది. మరోవైపు గత ఏడాది నెట్‌ఫ్లిక్స్ షేర్లు దాదాపు 38 శాతం పడిపోయాయి. అయితే, తర్వాత కంపెనీ ట్రేడింగ్ 6.1 శాతం పెరిగి 335.05 డాలర్లకు చేరుకుంది..

click me!