70 రోజుల బ్యాటరీ లైఫ్ తో కొత్త స్మార్ట్‌వాచ్‌.. దీని ఫీచర్స్ భలే ఉన్నాయిగా..

By asianet news telugu  |  First Published Jan 19, 2023, 6:42 PM IST

గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ సిరీస్  ఈ వాచ్‌లలో స్లీప్ స్కోర్, అడ్వాన్స్‌డ్ స్లీప్ మానిటర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇచ్చింది. అంతేకాకుండా హెల్త్ మ్యాట్రిక్స్, బాడీ బ్యాటరీ, ప్రేజర్ అండ్ హార్ట్ బీట్ కలిసి కనిపిస్తాయి. ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ సోలార్ ఎడిషన్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 70 రోజులు ఉంటుంది.


ప్రముఖ వెరబుల్ బ్రాండ్ గార్మిన్  దాని స్మార్ట్ వాచ్ సిరీస్‌ను ఇండియాలో  ప్రవేశపెట్టింది. గర్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ అనేది మల్టీస్పోర్ట్స్ స్మార్ట్‌వాచ్ దీనిని  గర్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ అండ్ గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ సోలార్‌తో సహా రెండు వేరియంట్‌లలో ప్రవేశపెట్టారు. ఈ రెండు వాచీలు గ్రాఫైట్ కాలర్స్ లో విడుదల చేసారు ఇంకా వీటి ధరలు రూ. 55,990 అలాగే రూ. 61,990.

గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ సిరీస్  ఈ వాచ్‌లలో స్లీప్ స్కోర్, అడ్వాన్స్‌డ్ స్లీప్ మానిటర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇచ్చింది. అంతేకాకుండా హెల్త్ మ్యాట్రిక్స్, బాడీ బ్యాటరీ, ప్రేజర్ అండ్ హార్ట్ బీట్ కలిసి కనిపిస్తాయి. ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ సోలార్ ఎడిషన్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 70 రోజులు ఉంటుంది. ఈ వాచ్‌లో సోలార్ ఛార్జింగ్ అని చెప్పినట్లు  పేరును బట్టి స్పష్టమవుతోంది. అంతేకాకుండా, ఈ రెండు వాచీలు థర్మల్ ఇంకా షాక్ రెసిస్టెంట్.

Latest Videos

RevoDrive అనలాగ్ హ్యాండ్ టెక్నాలజీ ఈ కొత్త వాచ్‌తో అందించారు, ఇది ఖచ్చితమైన ఆక్టివిటీ రిపోర్ట్స్  ఇస్తుందని చెప్పబడుతుంది. బ్యాటరీ సేవర్ మోడ్‌లో ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ సోలార్ ఎడిషన్‌ బ్యాటరీని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ సిరీస్‌లోని ఈ రెండు వాచ్‌లు ఇన్‌బిల్ట్ GPS, మల్టీ GNSS సపోర్ట్, ABC సెన్సార్, ట్రాక్‌బ్యాక్ రూటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్‌స్టింక్ట్ క్రాసోవర్ మల్టీగ్రేడ్ MIL-STD-810 సర్టిఫికేషన్‌ను పొందింది ఇంకా రెండు వాచీలు స్ట్రెచ్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. ఈ వాచీలు 100 మీటర్ల నీటిలో మునిగినా పాడవవు. 

ఈ వాచ్ ల లాంచ్‌పై గార్మిన్ ఇండియా కంట్రీ హెడ్ యేసుదాస్ పిళ్లై  మాట్లాడుతూ, “ప్రజలు ఆక్టివిటీ ఇంకా హెల్త్ లైఫ్ స్టయిల్ పట్ల పెరుగుతున్న ఆసక్తితో, భారతదేశంలో మా ఇన్‌స్టింక్ట్ సిరీస్‌ని విస్తరిస్తున్నందుకు  మేము సంతోషిస్తున్నాము. గార్మిన్ భారతశంలోని ఒక హైబ్రిడ్ GPS మల్టీస్పోర్ట్ స్మార్ట్‌వాచ్‌ని తీసుకువస్తుంది, కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మోడ్రన్ అడ్వెంచర్ స్మార్ట్‌వాచ్‌ని రీడిఫైన్ చేయబడింది. ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ రగ్గెడ్ ట్రెడిషనల్ అండ్ టెక్నాలజి వాచ్ లుక్ ని ఇష్టపడే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది అని అన్నారు.

click me!