అమెజాన్ ప్రైమ్ కావాలా..? మీకు ఏ ప్లాన్ బెస్ట్ తెలుసుకోవాలా.. ఈ బెనెఫిట్స్ పై లుక్కెయండి..

By asianet news telugu  |  First Published Jan 19, 2023, 8:21 PM IST

అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పటికే ఏడాది వాలిడిటీతో రెండు ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌ల ధర రూ.599 ఇంకా రూ.1499. అమెజాన్  రూ. 599 ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో వీడియోలు ఇంకా మూవీస్ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే ఆస్వాదించవచ్చు. 


అమెజాన్ ఇండియా తాజాగా ఓ‌టి‌టి ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లకు రూ. 999 ధరతో కొత్త అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్లాన్ అమెజాన్ బీటా వెర్షన్ ఫేస్ లో తీసుకువచ్చారు. ఈ ప్లాన్‌తో ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పటికే ఏడాది వాలిడిటీతో రెండు ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌ల ధర రూ.599 ఇంకా రూ.1499. మీరు కూడా OTT అండ్ మూవీస్ చూడటానికి Amazon Prime ప్లాన్‌  తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఇంకా ఈ ప్లాన్‌లతో  గందరగోళంగా ఉంటే ఈ మూడు ప్లాన్‌ల అన్ని వివరాలు ఇంకా బెనెఫిట్స్ మీకోసం....

అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్
అమెజాన్  రూ. 599 ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో వీడియోలు ఇంకా మూవీస్ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే ఆస్వాదించవచ్చు. యూజర్లు టీవీ ఇంకా ల్యాప్‌టాప్‌లో ప్రైమ్ వీడియోలను చూడలేరు. అయితే, ఈ ప్లాన్‌తో లేటెస్ట్ సినిమాలు, అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్ వంటి అమెజాన్ ప్రైమ్‌లోని అన్ని కంటెంట్‌లు యాక్సెస్ చేయబడతాయి.  అలాగే మీరు దానితో సింగిల్ స్క్రీన్ సపోర్ట్ మాత్రమే పొందుతారు. అంటే, మీరు ఒకేసారి ఒక ఫోన్‌లో మాత్రమే Amazon Primeకి లాగిన్ చేయగలరు.

Latest Videos

undefined

రూ. 599 ప్లాన్‌కి సైన్ అప్ చేయడానికి మీరు ప్రైమ్ వీడియో యాప్ (ఆండ్రాయిడ్) లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. కానీ మీరు స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే వీడియోలు ఇంకా సినిమాలను చూడగలరు. అంటే, మీరు మొబైల్‌లో OTT లేదా మూవీస్ చూడాలనుకుంటే, ఈ ప్లాన్ మీకు అతితక్కువ  ఇంకా బెస్ట్ ఆప్షన్. 

అమెజాన్ ప్రైమ్ లైట్
అమెజాన్ బీటా వెర్షన్‌లో వస్తున్న అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ ధర రూ.999. ఈ ధరతో మీరు ఒక సంవత్సరం వరకు వాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్‌తో 2 డివైజెస్ లో లాగిన్ చేయవచ్చు. మీరు Smart TVలో  కూడా ప్రైమ్‌ని కూడా ఆస్వాదించగలరు, అయితే ఈ ప్లాన్‌తో మీరు కొన్ని యాడ్స్ కూడా వస్తుంటాయి. రెండు డివైజెస్ లో ఒకటి తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ అయి ఉండాలని గుర్తుంచుకోండి. ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్ ఇంకా ప్రైమ్ ఇ-బుక్స్‌లకు యాక్సెస్ ఈ ప్లాన్‌తో అందుబాటులో లేదు.

అమెజాన్ కి  చెందిన అమెజాన్ ప్రైమ్ లైట్ రూ.999 ప్లాన్ తో రెండు రోజుల డెలివరీ సౌకర్యం లభిస్తుంది. Amazon Prime Liteతో అమెజాన్ ప్రైమ్ వీడియో చూడటానికి ఆన్ లిమిటెడ్ అవకాశం లభిస్తుంది, అయినప్పటికీ క్వాలిటీ HDగా ఉంటుంది. మీరు 4K వీడియో చూడలేరు. అంటే, ఈ ప్లాన్‌తో మీరు HD క్వాలిటీ వరకు కంటెంట్‌ను చూసే సదుపాయాన్ని పొందుతారు ఇంకా మీరు ఒక టీవీలో మాత్రమే లాగిన్ చేయవచ్చు. మీకు ల్యాప్‌టాప్ కూడా ఉంటే, మీకు చిన్న సమస్య ఉండవచ్చు.

అమెజాన్ ప్రైమ్ 
ఈ అమెజాన్ ప్రైమ్ ప్లాన్ ధర రూ.1,499. 1,499 రూపాయల ఈ ప్లాన్‌తో ఒక సంవత్సరం వాలిడిటీ   ఉంటుంది. మీరు ఈ ప్లాన్‌తో  ఎన్నో  వీడియోస్ చూడవచ్చు. Amazon Primeతో 4K వరకు వీడియోలను వీక్షించవచ్చు. ఈ మొబైల్ తో ట్యాబ్లెట్, టీవీని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే, మీరు ఒకేసారి మూడు డివైజెస్ లో లాగిన్ అయ్యే సదుపాయాన్ని పొందుతారు.

ఈ ప్లాన్ తో సింగిల్ డే లేదా ఆర్డర్ రోజు డెలివరీ అందిస్తుంది. అంటే, మీరు అమెజాన్ నుండి ఏదైనా వస్తువులను ఆర్డర్ చేస్తే, అదే రోజు వస్తువులను పొందే అవకాశాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, ఫ్రీ ఇ-బుక్స్, ప్రైమ్ గేమింగ్ ఇంకా నో-కాస్ట్ EMI కూడా ఈ ప్లాన్‌తో అందుబాటులో ఉన్నాయి. అంటే, ఈ ప్లాన్‌తో  మీరు అమెజాన్ అన్ని  సౌకర్యాలను పొందుతారు. మీరు OTTతో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే, ఈ ప్లాన్ మిమ్మల్ని నిరాశపరచదు. 

click me!