రిలయన్స్ జియో ఈ అద్భుతమైన ప్లాన్ ఉచిత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, 100GB డేటా అండ్ అపరిమిత కాల్స్ అందిస్తుంది.
ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పాటు, రిలయన్స్ జియో పోర్ట్‌ఫోలియోలో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ఉంది. రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రూ.299 నుండి ప్రారంభమవుతాయి. OTT ప్లాట్‌ఫారమ్‌కు సబ్ స్క్రిప్షన్ అందించే ఎన్నో ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియోలో ఉన్నాయి. మీరు జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఇష్టపడితే మీరు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.
రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ. 699 ప్లాన్ ప్యాక్ మొత్తం 100GB డేటాతో వస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, వినియోగదారులు ఒక్కో జీబీకి రూ.10కే పొందవచ్చు. రిలయన్స్ జియో ఈ ప్యాక్‌తో 3 ఫ్యామిలీ సిమ్‌లు అందిస్తుంది. ఫ్యామిలీ SIM డేటా కోసం, కస్టమర్‌లు ప్రతి SIM కార్డ్‌పై 5 GB అదనపు డేటాను పొందుతారు.
జియో కస్టమర్లు ఈ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. అంటే అదనపు ఛార్జీలు లేకుండా ఏదైనా నెట్‌వర్క్‌కి ఆన్ లిమిటెడ్ STD అండ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌తో జియో వినియోగదారులు ప్రతిరోజూ 100 ఉచిత SMSలను పొందవచ్చు.
రిలయన్స్ జియో కస్టమర్లు ఈ ప్లాన్‌తో పాపులర్ OTT ప్లాట్‌ఫారమ్‌కు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ అండ్ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఈ ప్యాక్ JioTV, JioCinema ఇంకా JioCloudకి ఉచిత యాక్సెస్ కూడా ఇస్తుంది. ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ 1 సంవత్సరం ఫ్రీ.
యాడ్-ఆన్ ఫ్యామిలీ సిమ్ కార్డ్ కోసం, కస్టమర్‌లు ప్రతి నెలా రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. మీరు Jio 5G నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తుంటే, మీరు ఈ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. JioCinema సబ్‌స్క్రిప్షన్ ప్రీమియం కంటెంట్‌కి యాక్సెస్‌ను అందించదని గమనించండి.