
గూగుల్ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్‌పై (Sundar Pichai) మహారాష్ట్రలో కేసు (Mumbai Police) నమోదైంది. కాపీరైట్ ఉల్లంఘన కింద ఆయనతోపాటు, యూట్యూబ్ గౌతమ్ ఆనంద్ సహా ఆరుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ సునీల్ దర్శన్ (Suneel Darshan) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని సునీల్ దర్శన్ మీడియాకు వెల్లడించారు.
‘ఏక్ హసీనా తీ ఏక్ దీవానా థా’ చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి అనధికార వ్యక్తులను గూగుల్ అనుమతించిందని చిత్ర దర్శకుడు సునీల్ దర్శన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో పాటు మరో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్లు 51, 63, 69 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2017లో తన చివరి సినిమా ‘‘ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా ఐ ’’ను తనకు తెలియకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారని దర్శన్ ఆరోపిస్తున్నారు.
కాగా.. గణతంత్ర దినోత్సవాన్ని (republic day) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పద్మ అవార్డులను (padma awards) ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన 128 మందికి అవార్డుల జాబితాలో చోటు దక్కింది. అందులో నలుగురికి పద్మవిభూషణ్ లభించింది. వీరిలో ముగ్గురికి మరణానంతరం లభించింది. 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను పద్మభూషణ్ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.