Operating System: గూగుల్, యాపిల్‌ కంపెనీలకు కేంద్రం షాక్..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 26, 2022, 12:46 PM ISTUpdated : Jan 26, 2022, 12:55 PM IST
Operating System: గూగుల్, యాపిల్‌ కంపెనీలకు కేంద్రం షాక్..!

సారాంశం

గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సాంకేతిక రంగంలో భారతదేశం కీలకమైన అభివృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే అనేక ఆవిష్కరణలకు తెర దీసింది. అయితే ఇదే ఉత్సాహంతో మరో ముందడుగు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. 

గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సాంకేతిక రంగంలో భారతదేశం కీలకమైన అభివృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే అనేక ఆవిష్కరణలకు తెర దీసింది. అయితే ఇదే ఉత్సాహంతో మరో ముందడుగు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.  ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్లలో రెండు రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ పని చేస్తున్నాయి. ఒకటి గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ వెర్షన్, రెండవది యాపిల్ ఫోన్స్ మాత్రమే సంబంధించిన ఐఓఎస్. 

ఇప్పుడు ఈ రెండు విదేశీ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మీడియా ముందు వెల్లడించారు. దీనికోసం వివిధ పరిశ్రమల నిమిత్తం పర్యావరణ వ్యవస్థ‌ను సులభతరం చేయనున్నామన్నారు. స్వదేశీ హ్యాండ్ సెట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆసక్తిగా ఉందన్నారు రాజీవ్ చంద్రశేఖర్.

ఇప్పటికే ప్రపంచంలో ఉన్న అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువ భాగం గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్ ను ఉపయోగిస్తున్నాయి. దీని తర్వాత అదే స్థాయిలో అత్యధికంగా ఉపయోగించేది  ఐఓఎస్. ఇది యాపిల్ సంస్థకు చెందింది. అయితే ఐఓఎస్ అనేది కేవలం ఆపిల్ సంస్థ రూపొందించిన స్మార్ట్ ఫోన్ లకు మాత్రమే ఉపయోగిస్తుంది. మరే ఇతర సంస్థ దీనిని ఉపయోగించడానికి యాపిల్ అనుమతించదు. అంతేగాకుండా ఐఓఎస్ వినియోగానికి చాలా ఖర్చు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఎక్కువ భాగం ఆండ్రాయిడ్ ఓఎస్ ను అందించడానికి మొగ్గు చూపుతాయి.

అయితే ప్రపంచంలో ఇప్పటికే చాలా కంపెనీలు కు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ అవి అంతా ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ కారణంగానే ఆండ్రాయిడ్ ఓఎస్ ను స్మార్ట్ ఫోన్ లకు అందించేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తాయి. అయితే వీటిని పక్కనపెట్టే విధంగా.. నిజం చెప్పాలంటే వీటిని తలతన్నే విధంగా ఓ ఓఎస్ ను కేంద్రం రూపొందించాలని భావిస్తుంది.

కేంద్రం తీసుకురానున్న కొత్త ఓఎస్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఓఎస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ముఖ్యంగా మన దేశంలో ఉండే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే మన దేశంలో సగటున ప్రతీ భారతీయుడికి ఓ మొబైల్ ఉంది. ఇంకా స్మార్ట్ ఫోన్లు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొత్త ఓఎస్ ను రూపొందిస్తే మంచి ఆదరణ కూడా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ ఓఎస్ రూపొందించే ప్రాజెక్ట్ ను మేకిన్ ఇండియాలో భాగంగా రూపొందించాలి పలువురు నిపుణులు కేంద్రానికి సూచించినట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్మార్ట్ ఫోన్ లు అమ్ముడు అయ్యే భారత్ లో గూగుల్, యాపిల్ సంస్థలకు గట్టి దెబ్బతగిలినట్లు అనే నిపుణులు భావిస్తున్నారు. దీనితో పాటే ఇప్పటికే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాయితీలను కూడా పెంచితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేపట్టన మేకిన్ ఇండియా మరో లెవల్ కు వెళ్తుందని చెప్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా