Vivo Y21A: విడుద‌లైన వివో వై21ఏ.. ధ‌ర ఎంతంటే..?

By team telugu  |  First Published Jan 26, 2022, 5:01 PM IST

వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వివో వై21ఏ (Vivo Y21A)ను భారతదేశంలో మంగ‌ళ‌వారం (జ‌న‌వ‌రి 25) విడుదల చేసింది. 


వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వివో వై21ఏ (Vivo Y21A)ను భారతదేశంలో మంగ‌ళ‌వారం (జ‌న‌వ‌రి 25) విడుదల చేసింది. ఈ వివో ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, డైమండ్ గ్లో అనే 2 కలర్ ఆప్షన్‌లలో విడుదలైంది. Vivo Y21A స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి నోట్ 10, పోకో ఎం3, ఇన్ఫినిక్స్ నోట్ 11ఎస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టిపోటీని ఇస్తుందని సంస్థ పేర్కొంది. 

వివో వై21ఏ ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో టెక్నో పోవా నియో, నోకియా జీ10, టెక్నో స్పార్క్ 8, మోటో ఇ7 పవర్ లాంటి మోడల్స్ ఉన్నాయి.  వివో Y21A స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,990గా సంస్థ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్‌లో అందుబాటులో ఉంది. వివో ఇండియా ఈ-స్టోర్, అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్‌లలో సేల్‌కు అందుబాటులో ఉంది. ఇంతకుముందు, Vivo Y21e స్మార్ట్‌ఫోన్ రూ. 12,990 ధరతో ప్రారంభించారు. ఈ ఫోన్ 3GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

Latest Videos

Vivo Y21A స్పెసిఫికేషన్‌లు
వివో వై21ఏ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. వివో ఎక్స్‌ప్యాండింగ్ ర్యామ్ ఫీచర్‌తో 1జీబీ వరకు ర్యామ్ పెంచుకవోచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ + మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంది. ఆ స్మార్ట్‌ఫోన్ బరువు 182 గ్రాములు.

కెమెరా ఫీచర్స్
వివో వై21ఏ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. కెమెరాలో ఫోటో, పోర్ట్‌రైట్, వీడియో, పనో, లైవ్ ఫోటో, టైమ్ ల్యాప్స్, ప్రో, డాక్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ V5.0, GPS / A-GPS, FM రేడియో, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్ల గురించి మాట్లాడితే, ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

click me!