లెనోవోకు చెందిన మోటరోలా సంస్థ ఫోల్డబుల్ ఫోన్ల విపణిలోనూ అడుగు పెట్టింది. దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్‌కు పోటీగా ఫోల్డబుల్ ఫోన్‌ను లాస్‌ఏంజిల్స్‌లో ఆవిష్కరించింది.
లాస్ ఏంజిల్స్: దక్షిణ కొరియా మొబైల్ మేజర్ శామసంగ్‌మాదిరిగానే మోటరొలా కూడా ఓ ఫోల్డబుల్ ఫోన్ తీసుకు వస్తుందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్నది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. తాజాగా లెనోవోకు చెందిన మోటోరొలా తన సరికొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. గతంలో రేజర్ (Razr) పేరిట తీసుకొచ్చిన పాతతరం ఫ్లిప్ ఫోన్ ఫోల్డబుల్ ఫోన్ రేజర్ (2019)ని తీసుకొచ్చింది.
లాస్ఏంజిల్స్ లో జరిగిన కార్యక్రమంలో మోటరోలా ఈ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ మడత ఫోన్లో 6.2 అంగుళాల స్క్రీన్ తో పాటు ముందువైపు సెకండరీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.ఈ ఫోన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి అమెరికాలో అమ్మకానికి రానుంది. డిసెంబర్ 26 నుంచి ప్రీ ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. భారత్ విఫణిలోకి కూడా ఈ ఫోన్ రానున్నా ఎప్పుడొచ్చేదీ కంపెనీ వెల్లడించలేదు.
undefined
also read స్మార్ట్ ఫోన్లకు అప్ డేట్ గా కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్...
అయితే, కంపెనీ ఇండియన్ వెబ్‌సైట్‌లో మాత్రం రిజిస్ట్రేషన్ పేజీని కంపెనీ అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ ధరను 1,499.99 డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం 1.07లక్షలన్నమాట. ఈ ఫోన్ భారతదేశ విపణిలో అడుగుపెట్టేటప్పుడు దీని ధర ఎంతపెడతారనేదానిపై స్పష్టత లేదు.
మోటరోలా రేజర్ ఫోల్డబుల్ ఫోన్లో 6.2 అంగుళాల ఫ్లెక్సీ ఓఎల్ఈడీ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. దీన్ని సగానికి మడుచుకోవచ్చు. ఫోన్ తెరిచేటప్పుడు స్క్రీన్ మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా కంపెనీ జాగ్రత్త తీసుకున్నది. దీంతో పాటు ముందు వైపు 2.7 అంగుళాల క్విక్ వ్యూ డిస్ ప్లే చేర్చడంతో ఫోన్ తెరవకుండనే నోటిఫికేషన్లతో మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు. ఇందులో 16 ఎంపీ కెమెరాను వినియోగించారు.
also read రికార్డుల హోరు.. నష్టాల బాటలో టెల్కోలు.. రూ.74 వేల కోట్లకు..
ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు దీన్నే సెల్ఫీ కెమెరాగా వాడుకోవచ్చు. దీని ద్వారా రాత్రివేళ్లలో కూడా అద్భుత చిత్రాలు తీయొచ్చని కంపెనీ చెబుతోంది. డిస్‌ప్లే నాచ్‌లో 5 ఎంపీ కెమెరాను వినియోగించారు. అన్ ఫోల్డ్ చేసినప్పుడు సెల్ఫీ కెమెరాగా ఉపయోగ పడుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో పనిచేస్తుంది.
ఫోన్ ముందుభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సర్లు అమర్చారు. యూఎస్బీ టైప్-సి పోర్ట్, స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్లో 6జీబీ ర్యామ్, 2510 బ్యాటరీని వినియోగించారు. 15వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎలాంటి సిమ్ స్లాట్ ఉండదు. కేవలం ఈ-సిమ్ కార్డుకు మాత్రమే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వీటితోపాటు ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.0 వంటి వసతులు ఉన్నాయి. ఈ ఫోన్ 205 గ్రాముల బరువు ఉంటుంది.