స్మార్ట్ ఫోన్లకు అప్ డేట్ గా కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్...

Published : Nov 15, 2019, 11:30 AM IST
స్మార్ట్ ఫోన్లకు అప్ డేట్ గా కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్...

సారాంశం

కలర్‌ ఓఎస్ 7 ద్వారా దాదాపు ఆండ్రాయిడ్ అనుభవాన్ని తిసుకురాబోతున్నాము అని రియల్‌ మీ ఇండియా సీఈఓ తెలిపారు.ఒప్పో కంపెనీ నవంబర్ 20 న చైనాలో కలర్‌ ఓఎస్ 7 ను విడుదల చేస్తున్నట్లు గత వారం ప్రకటించింది. కొత్త కలర్‌ ఓఎస్ వెర్షన్ ఆండ్రాయిడ్ 10 పైన పనిచేసే అవకాశం ఉంది.

కలర్‌ ఓఎస్ 7 నవంబర్ 26 న భారత్‌లో లాంచ్ కానున్నట్లు ఒప్పో సంస్థ సోమవారం వెల్లడించింది. కలర్‌ ఓఎస్ 6 కి ఇది అప్ డేట్ గా చైనా కంపెనీ దీనిని విడుదల చేస్తుంది. ఈ ఓఎస్ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లలోకి ప్రవేశించడంతో పాటు, కొత్త కలర్‌ ఓఎస్ కొన్ని రియల్‌ మీ ఫోన్‌లకు  కూడా అప్ డేట్ గా వస్తుంది.

ఒప్పో కంపెనీ నవంబర్ 20 న చైనాలో కలర్‌ ఓఎస్ 7 ను విడుదల చేస్తున్నట్లు గత వారం ప్రకటించింది. కొత్త కలర్‌ ఓఎస్ వెర్షన్ ఆండ్రాయిడ్ 10 పైన పనిచేసే అవకాశం ఉంది. అయితే, మునుపటి ఆండ్రాయిడ్ వెర్షన్‌లను నడుపుతున్న స్మార్ట్‌ఫోన్‌లకు కలర్‌ ఓఎస్ 7 అప్‌డేట్‌ను కంపెనీ తీసుకొస్తుంది.

also read అమ్మో!! ఇండియాలో బిజినెస్ చేయలేం: సీఈఓ...

భారతదేశంలో కలర్‌ ఓఎస్ 7 ప్రారంభ తేదీని వెల్లడించడానికి ఒప్పో సోమవారం "సేవ్ ది డేట్" ఇమెయిల్‌ను వార్తా పత్రికలకు పంపింది. చైనా మార్కెట్లో కొత్త కలర్‌ఓఎస్ వెర్షన్‌ను ఆవిష్కరించడానికి బీజింగ్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కంపెనీ గత వారం ప్రకటించింది.

కలర్ ఓఎస్7 కొత్త గేమింగ్ మరియు మల్టీమీడియా లక్షణాలను తీసుకువస్తుందని భావిస్తున్నారు. కొత్త కలర్‌ఓఎస్‌లో సిస్టమ్-వైడ్ డార్క్ మోడ్ కూడా ఉంటుంది.రియల్‌ మీ ఇండియా సీఈఓ గత నెలలో యూట్యూబ్‌లో అడిగిన ఒక మాస్క్ సెషన్‌లో రియల్‌ మీ-స్పెసిఫిక్ కలర్‌ ఓఎస్ 7 వెర్షన్ దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవంతో వస్తుందని నొక్కి చెప్పారు.

also read అలాంటి వెబ్‌సైట్‌లను గుర్తించడానికే ఇలా : గూగుల్ క్రోమ్

అయితే, ఎగ్జిక్యూటివ్ కొత్త అప్ డేట్ పైన ఎలాంటి ప్రత్యేకమైన విషయాన్ని ప్రకటించలేదు.భారతదేశంలో రియల్ మీ కంపెనీ నవంబర్ 20 న రియల్ మీ ఎక్స్ 2 ప్రోను ఒక ఈవెంట్ ద్వారా లాంచ్ చేస్తున్నట్టు తెలిపారు.

రియల్‌ మీ మాదిరిగానే ఒప్పో తన స్మార్ట్‌ఫోన్‌ల కోసం కలర్‌ ఓఎస్ 7 అప్ డేట్ ను సిద్ధం చేస్తోంది. ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌తో పాటు కొత్త కలర్‌ఓఎస్ వెర్షన్‌ను అందుకుంటున్న మొట్ట మొదటి డివైజ్ ఇది.
 

PREV
click me!

Recommended Stories

Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?