ఇన్ఫినిక్స్ కొత్త ప్రీమియం 5జి స్మార్ట్‌ఫోన్.. 12 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్..

By asianet news teluguFirst Published Oct 6, 2022, 4:05 PM IST
Highlights

ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జి కాస్లైట్ సిల్వర్, జెనెసిస్ నోయిర్ కలర్ ఆప్షన్లలో పరిచయం చేసారు. అయితే సింగిల్ స్టోరేజ్‌లో ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జి 8జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్ ధర $ 520 (అంటే దాదాపు రూ. 42,400).

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జిని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 180W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. దీనికి ముందు మోటోరోల ఎడ్జ్ 30 అల్ట్రాలో 200-మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. 

ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జి ధర 
ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జి కాస్లైట్ సిల్వర్, జెనెసిస్ నోయిర్ కలర్ ఆప్షన్లలో పరిచయం చేసారు. అయితే సింగిల్ స్టోరేజ్‌లో ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జి 8జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్ ధర $ 520 (అంటే దాదాపు రూ. 42,400). అయితే, దీనిని భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టడం గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. 

ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జి స్పెసిఫికేషన్‌లు
ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జి పంచ్ హోల్‌తో 6.8-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, డిస్ ప్లే120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత XOS 12 ఫోన్‌లో ఉంది. MediaTek Dimensity 920 ప్రాసెసర్‌తో 8జి‌బి ర్యామ్, 256 జి‌బి స్టోరేజ్ ఉంది. ఫోన్‌లో సెక్యూరిటి కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 

ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జి కెమెరా
ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 

ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5G బ్యాటరీ 
ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5G 180W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4,500mAh బ్యాటరీ ప్యాక్ చేస్తుంది. బ్యాటరీకి సంబంధించి 12 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇతర కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5G, GPS, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్, Wi-Fi6కి సపోర్ట్ ఉంది. 

click me!