ఈ మోటోరోల స్మార్ట్‌ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ కలర్‌లో పరిచయం చేసారు. ఈ ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది, 64జిబి స్టోరేజ్ 4జిబి ర్యామ్ ధర రూ. 8,999.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతుంది. తాజాగా కంపెనీ E సిరీస్ కింద భారతదేశంలో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో E22sని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ 5,000mAh బ్యాటరీతో పరిచయం చేసారు. ఈ సంవత్సరం ఆగస్టులో కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లో మోటో E22ను ప్రవేశపెట్టింది.
మోటో E22s ధర
ఈ మోటోరోల స్మార్ట్‌ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ కలర్‌లో పరిచయం చేసారు. ఈ ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది, 64జిబి స్టోరేజ్ 4జిబి ర్యామ్ ధర రూ. 8,999. ఈ ఫోన్‌ను కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
undefined
మోటో E22s స్పెసిఫికేషన్‌లు
ఈ ఫోన్‌లో 6.5-అంగుళాల HD + ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, పంచ్‌హోల్ డిజైన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12తో సెక్యూరిటి కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. మోటో E22sకి MediaTek Helio G37 ప్రాసెసర్, 4జిబి ర్యామ్ తో 64జిబి స్టోరేజ్ సపోర్ట్ ఉంది. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీ 1టిబి వరకు పెంచుకోవచ్చు.
మోటో E22s కెమెరా
మోటో E22sలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. LED ఫ్లాష్ బ్యాక్ కెమెరాతో వస్తుంది.
మోటో E22s బ్యాటరీ
మోటో E22s 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇంకా బ్యాటరీకి సంబంధించి ఫోన్ సింగిల్ ఛార్జింగ్‌తో రెండు రోజుల పాటు పనిచేయగలదని కంపెనీ పేర్కొంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ ఉంది.