మళ్లీ అర్ధరాత్రి 2 వరకు షాపింగ్; జనవరి 4 నుండి 7 వరకు 50% డిస్కౌంట్..

By Ashok kumar Sandra  |  First Published Dec 30, 2023, 7:52 PM IST

జనవరి 4న ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మాల్ నిరంతరం తెరిచి ఉంటుంది. జనవరి 7వ తేదీ వరకు ఇదే పద్ధతి కొనసాగుతుంది. కస్టమర్లలో నైట్ షాపింగ్‌ను ప్రోత్సహించడానికి మాల్ 50 శాతం తగ్గింపు కూడా అందిస్తుంది. 


కొత్త సంవత్సరంలో మొదటి లులు ఆన్ సేల్, లులు ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ షాపింగ్ వేడుకల్లో భాగంగా జనవరి 4 నుండి 7 వరకు లులు మాల్‌లో మిడ్‌నైట్ షాపింగ్ ఇంకా ఫ్లాట్ ఫిఫ్టీ సేల్ అందిస్తుంది. ఇందులో భాగంగా లులు హైపర్‌మార్కెట్, ఫ్యాషన్ స్టోర్ ఇంకా కనెక్ట్‌తో సహా అన్ని లులు షాపుల్లో 50% శాతం డిస్కౌంట్ ఉంటుంది. మాల్‌లోని రిటైల్ షాపుల్లో కస్టమర్‌లు 50% వరకు తగ్గింపు అలాగే ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు. 

జనవరి 4న ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మాల్ నిరంతరం తెరిచి ఉంటుంది. జనవరి 7వ తేదీ వరకు ఇదే పద్ధతి కొనసాగుతుంది. కస్టమర్లలో నైట్ షాపింగ్‌ను ప్రోత్సహించడానికి మాల్ 50 శాతం తగ్గింపు కూడా అందిస్తుంది. గ్రోసరీ, ఎలక్ట్రానిక్స్ ఇంకా ఫ్యాషన్ ఉత్పత్తులకు ఈ నాలుగు రోజుల్లో భారీ తగ్గింపు ఉంటుంది. 

Latest Videos

అంతర్జాతీయ బ్రాండ్‌లతో సహా 500 కంటే ఎక్కువ బ్రాండ్‌లు సీజన్ ఎండింగ్  సేల్ షాపింగ్‌లో పాల్గొంటాయి. లులు సూపర్ షాపర్ గిఫ్ట్స్ మిడ్‌నైట్ షాపింగ్ డేస్‌లో టాప్ షాపర్‌లకు అందజేయబడతాయి. గిఫ్ట్స్ లులు హ్యాపీనెస్, లులు లాయల్టీ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. 

ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ ఇంకా స్పోర్ట్స్ విభాగాల్లో షాపింగ్ చేసినందుకు గిఫ్ట్స్ అందించనుంది. ఈ రోజుల్లో, మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లోని అన్ని దుకాణాలు, వినోద కేంద్రమైన లులు ఫంచురా తెల్లవారుజామున 2 గంటల వరకు తెరిచి ఉంటాయి. మాల్‌లో లులు ఆన్ సేల్ జనవరి 4 నుండి 7 వరకు, లులు ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ జనవరి 1 నుండి 21 వరకు నడుస్తుంది. అయితే ఈ షాపింగ్ ఫెస్టివల్ కేరళలోని తిరువనంతపురంలో ఉండనుంది. 

click me!