Vivo X100 సిరీస్ ఇటీవలే చైనాలో ప్రారంభమైంది. భారతదేశంలోని కస్టమర్లు 2024 ప్రారంభంలో ఫోన్‌ను పొందే అవకాశాన్ని పొందుతారు.
ఇండియాలో Vivo X100 అండ్ X100 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీ ఎట్టకేలకు ప్రకటించింది. కంపెనీ తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు ఎక్స్-సిరీస్, ప్రీమియం జీస్ ఆప్టిక్స్ కెమెరాల వారసత్వాన్ని కొనసాగిస్తోంది. Vivo స్మార్ట్‌ఫోన్‌లు OnePlus 12 ఇంకా Xiaomi 13/14 సిరీస్ వంటి వాటితో మార్కెట్లో పోటీ పడుతున్నాయి.
2024 జనవరి 4న Vivo X100 ఇంకా X100 Pro స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో ఆవిష్కరించబడతాయి. వచ్చే వారం గురువారం Vivo కొత్త ఫోన్‌లను పరిచయం చేయడానికి వర్చువల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్ సందర్భంగా ఫోన్ ధరలు వెల్లడవుతాయి.
చైనాలో 12GB+256GB Vivo X100 ధర CNY 3,999గా ఉన్నందున Vivo భారతదేశంలో ఈ ఫోన్ కోసం దాదాపు రూ. 50,000 వసూలు చేసే అవకాశం ఉంది. ఇక X100 Pro CNY 4,999కి రిటైల్ అవుతుంది, దీని ధర భారతదేశంలో రూ. 60,000 కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.
Vivo X100 అండ్ X100 Pro 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ ఉంది. MediaTek నుండి సరికొత్త ఫ్లాగ్‌షిప్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్, గరిష్టంగా 16GB RAM అలాగే 1TB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లకు సపోర్ట్ ఇస్తుంది, రెండు డివైజెస్ ఇంటర్నల్ భాగాలకు శక్తినిస్తుంది. Funtouch OS వెర్షన్ భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
X100, X100 ప్రోల మధ్య పెద్ద తేడా ఏమిటంటే బ్యాక్ కెమెరాలో అదనపు కెమెరా అండ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది. X100 పెద్ద 5000mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే, ప్రో మోడల్ 100W వైర్డు ఫాస్ట్ అండ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5400mAh బ్యాటరీని పొందుతుంది.
Official ✅
Vivo X100 and X100 Pro are launching in India on 4 January, 2024. pic.twitter.com/3jv2sy5RgM