విడుదలకు ముందే ఎంఐ ఏ3 ఫీచర్లు లీక్‌!

By rajesh yFirst Published Jul 15, 2019, 11:12 AM IST
Highlights

బడ్జెట్ ఫోన్ల చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘షియోమీ’ మార్కెట్లోకి త్వరలో ఎంఐ ఎ3 ఫోన్ విడుదల చేయనున్నది. అయితే విడుదల కాకముందే ఫీచర్లు లీకయ్యాయి. మరోవైపు దక్షిణ కొరియా మేజర్ ఎల్ జీ తన డబ్ల్యూ 30 స్మార్ట్ ఫోన్లను అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా సోమవారం నుంచి అమెజాన్ నుంచి విక్రయాలు చేపట్టనున్నది.

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ రంగంలో దూసుకెళ్తున్న చైనా దిగ్గజ సంస్థ షియోమీ ‘ఎ3’ పేరిట మరో ఫోన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నది. ఇదే సంస్థ గతంలో ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద ఏ1, ఏ2 ఫోన్లు విడుదల చేసింది. అయితే షియోమీ ఏ3 విడుదల కాకకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన చిత్రాలు, స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. దీనిబట్టి ఈ ఫోన్‌ మూడు రంగుల్లో లభ్యం కానుంది.

 

స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌తో వినియోగదారుల ముంగిట్లోకి రానున్న ఈ ఫోన్‌.. 6 అంగుళాల ఫుల్‌ హెచ్‌ ప్లస్‌ సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేతో అలరించనుంది. 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతోపాటు బ్యాక్ ట్రిపుల్‌ కెమెరా ఉంటుందని లీకేజీ ద్వారా స్పష్టమవుతోంది. వెనుకవైపు 48+8+2 ఎంపీ సెన్సర్లు అమర్చి ఉంటాయి. 


4000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో బ్యాటరీతో వస్తున్న షియోమీ ఎ3 ఫోన్‌.. ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌, టైప్‌సీ పోర్ట్‌ ఉంటాయి. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో రానుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారికంగా మొబైల్‌ విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

 

నేటి నుంచి అమెజాన్ ద్వారా ఎల్‌జీ డబ్ల్యూ30 స్మార్ట్‌ఫోన్లు
దక్షిణ కొరియా ప్రముఖ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఎల్‌జీ డబ్ల్యూ30 స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలను అమెజాన్ ద్వారా చేపడుతున్నట్లు పేర్కొంది. మూడు రంగుల్లో థండర్ బ్లూ, ప్లాటినం గ్రేలో ఫోన్లను రూపొందించారు. జూలై 15 నుంచి ఫోన్ల విక్రయాలు మొదలు కానున్నాయి. ఫోన్ ధర రూ. 9,999 అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది. గత నెలలో భారత మార్కెట్‌లో ఎల్‌జీ డబ్ల్యూ30 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ ద్వారా ఎల్‌జీ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

click me!