స్నేక్ గేమ్‌తో నోకియా ఫోన్ బ్యాక్.. 4జి, కెమెరా, యుపిఐ ఇంకా మరెన్నో ఫీచర్స్..

By Ashok Kumar  |  First Published Jun 28, 2024, 10:01 PM IST

నోకియా 3210 పాత మోడల్ ని కొత్త మార్పులతో ప్రవేశపెట్టింది. కానీ డిజైన్‌తో సహా ఆ పాత కళ  దెబ్బతినలేదు. ఇందులో స్నేక్  గేమ్ ఉండటం విశేషం. Nokia 3210 ఒరిజినల్ మోడల్  25వ వార్షికోత్సవం సందర్భంగా వస్తుంది.


ఢిల్లీ: 'నోకియా 3210' మోడల్‌ను మనం మరచిపోగలమా ? మనలో చాలా మందికి నోకియా 3210ని లగ్జరీ ఫోన్‌గా ఉపయోగించిన  రోజులు  గుర్తుండే  ఉంటాయి. ఈ ఫోన్‌లోని స్నేక్  గేమ్ ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు నోకియా 3210 4G కనెక్టివిటీ, కెమెరా, యాప్స్, యూట్యూబ్ & UPI వంటి కొత్త ఫీచర్లతో తిరిగి భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ క్లాసిక్ ఫోన్ పాత మోడల్ లాగానే కీప్యాడ్ స్టయిల్ తో  వస్తుంది. 

అయితే నోకియా 3210 పాత మోడల్ ని కొత్త మార్పులతో ప్రవేశపెట్టింది. కానీ డిజైన్‌తో సహా ఆ పాత కళ  దెబ్బతినలేదు. ఇందులలో స్నేక్  గేమ్ ఉండటం విశేషం. Nokia 3210 ఒరిజినల్ మోడల్  25వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్లోకి వస్తుంది. ఈ ఫోన్  3  కలర్స్  అప్షన్స్ లో  అందుబాటులో ఉంటుంది. ఫోన్ 1,450 mAh బ్యాటరీ, 2-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, LED ఫ్లాష్ లైట్, 4Gలో 9.8 గంటల వరకు టాక్ టైమ్‌, NPCI-అప్రూవ్డ్  UPI అప్లికేషన్ కూడా ఉంది, దీనితో స్కాన్ చేయవచ్చు అలాగే  ఆన్‌లైన్ పేమెంట్స్  కోసం ఉపయోగించవచ్చు. వెథర్, వార్తలు, క్రికెట్ స్కోర్, గేమ్‌లకు సంబంధించిన ఎనిమిది అప్లికేషన్‌లను ఫోన్‌లో చూడవచ్చు. అంతే కాకుండా, మీరు YouTube ఇంకా  YouTube మ్యూజిక్ అప్లికేషన్ కూడా పొందుతారు. 

Latest Videos

కొత్త డ్యూయల్ సిమ్ నోకియా 3210 2.4-inch QVGA డిస్‌ప్లే, S30+లో ఆపరేటింగ్ సిస్టమ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్,  32GB వరకు సపోర్ట్ చేసే మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. బ్లూటూత్ 5.0, వైర్డు అండ్  వైర్‌లెస్ FM, MP3 ప్లేయర్, USB టైప్-సి పోర్ట్  తో  కొత్త నోకియా 3210 ధర రూ.3,999. నోకియా ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా ఫోన్ని   కోనవచ్చు. 

click me!