మల్టీ స్పోర్ట్స్ మోడ్, ఎన్నో గొప్ప ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్.. ఇప్పుడు ప్రీమియం డిజైన్‌లో తక్కువ ధరకే..

By asianet news teluguFirst Published Jan 11, 2023, 5:37 PM IST
Highlights

మ్యాక్స్ ప్రో షోగన్ స్మార్ట్‌వాచ్ ఆయిల్ ఫినిషింగ్ అండ్ ప్రీమియం డిజైన్‌లో పరిచయం చేసారు. ఈ వాచ్ ధర రూ.1,799. స్మార్ట్ వాచ్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. 
 

దేశీయ కంపెనీ మాక్సిమా కొత్త స్మార్ట్‌వాచ్ మ్యాక్సిమా మ్యాక్స్ ప్రో షోగన్‌ను ఇండియాలో విడుదల చేసింది. మ్యాక్సిమా స్మార్ట్‌వాచ్ సిరీస్  ఈ కొత్త ఎడిషన్ ఆయిల్ ఫినిషింగ్ ఇంకా ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. మాక్స్ ప్రో షోగన్ స్మార్ట్‌వాచ్ ని ఎన్నో గొప్ప ఫీచర్లతో తీసుకొచ్చారు. వాచ్‌లో 1.85-అంగుళాల హెచ్‌డి బిగ్ డిస్‌ప్లే, అల్ట్రా-బ్రైట్ స్క్రీన్‌కు సపోర్ట్ ఉంది. ఈ వాచ్‌లో పవర్ సేవర్ ఇంకా సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మాక్స్ ప్రో షోగన్ స్మార్ట్‌వాచ్ ధర ఇతర స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం...

మ్యాక్సిమా మాక్స్ ప్రో షోగన్ ధర 
మ్యాక్స్ ప్రో షోగన్ స్మార్ట్‌వాచ్ ఆయిల్ ఫినిషింగ్ అండ్ ప్రీమియం డిజైన్‌లో పరిచయం చేసారు. ఈ వాచ్ ధర రూ.1,799. స్మార్ట్ వాచ్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. 

మ్యాక్సిమా మాక్స్ ప్రో షోగన్ స్పెసిఫికేషన్లు
మాక్స్ ప్రో సిరీస్‌లోని తాజా స్మార్ట్‌వాచ్ పెద్ద 1.85-అంగుళాల డిస్‌ప్లే, 91 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉంది. అల్ట్రా-బ్రైట్ స్క్రీన్, 550 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ వంటి ఎన్నో తాజా ఫీచర్‌లతో మ్యాక్స్ ప్రో షోగన్ డిస్‌ప్లే లభిస్తుంది. వాచ్ లేటెస్ట్ UI డిజైన్, స్మార్ట్-కంట్రోల్ కెమెరా/మ్యూజిక్ సిస్టమ్, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లకు యాక్సెస్ ఇంకా DND/పవర్ సేవర్ వంటి ఎన్నో ఫీచర్లను అందిస్తుంది. ఫైండ్ మై ఫోన్, వెదర్ అప్‌డేట్, క్యాలిక్యులేటర్ వంటి ఫీచర్లు కూడా వాచ్‌తో ఉన్నాయి. 

మాక్స్ ప్రో షోగన్ లో 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, ఎక్సర్‌సైజ్ రికార్డ్, Floppy, 2048, Hamster and Battleship, HR/SPO2 వంటి నాలుగు ఇన్-బిల్ట్ గేమ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ స్లిపింగ్ మానిటర్, స్ట్రెస్ మానిటరింగ్ ఇంకా బ్రీథింగ్ ఎక్సర్సైజ్, డ్రింకింగ్ అలర్ట్, సెడెంటరీ రిమైండర్, అలారం, స్టాప్‌వాచ్, టైమర్, ఫ్లాష్‌లైట్ ఇంకా మెన్స్ట్రువల్ ట్రాకర్‌కు సపోర్ట్ ఇచ్చే ఫీచర్లతో కూడా వస్తుంది. వాచ్ ని మ్యాక్సిమా స్మార్ట్ ఫిట్ యాప్‌కి కనెక్ట్ చేయవచ్చు. 

click me!