మార్కెట్లోకి కొత్త పవర్ ఫుల్ 5జి ఫోన్.. 19జి‌బి ర్యామ్ తో బ్యాటరీ లైఫ్ లో కింగ్.. ఫీచర్స్ పై లుక్కేయండి..

By asianet news telugu  |  First Published Jan 11, 2023, 12:47 PM IST

డూగీ వి మ్యాక్స్‌ లో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డి ఐ‌పి‌ఎస్ ప్యానెల్‌ పొందుతుంది, ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గొరిల్లా గ్లాస్  ప్రొటెక్షన్ డిస్ ప్లేతో అందించారు. ఇంకా డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో ఫోన్‌కు 12జి‌బి ర్యామ్ సపోర్ట్ లభిస్తుంది.


స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ డూగీ కొత్త పవర్ ఫుల్ ఫోన్ డూగీ వి మ్యాక్స్‌ను త్వరలో లాంచ్ చేయబోతోంది. అయితే ఫోన్ పై లీకైన స్పెసిఫికేషన్లు చూస్తే  ఫోన్ బ్యాటరీ లైఫ్ కింగ్ అని సూచిస్తున్నాయి. కానీ డూగీ వి మ్యాక్స్‌ని ప్రత్యేకంగా నిలబెట్టేది బ్యాటరీ మాత్రమే కాదు. కెమెరా విభాగంలో కూడా ఫోన్ బెస్ట్ చేస్తోంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌తో డూగీ 22000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించబోతున్నట్లు క్లెయిమ్ చేస్తున్నారు. 19జి‌బి వరకు వర్చువల్ ర్యామ్ కూడా ఫోన్‌లో ఉంటుంది. వచ్చే నెలలో ఈ ఫోన్‌ను విడుదల చేయవచ్చు. డూగీ వి మ్యాక్స్‌ ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం...

డూగీ వి మ్యాక్స్‌ ఫీచర్స్ 
డూగీ వి మ్యాక్స్‌ లో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డి ఐ‌పి‌ఎస్ ప్యానెల్‌ పొందుతుంది, ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గొరిల్లా గ్లాస్  ప్రొటెక్షన్ డిస్ ప్లేతో అందించారు. ఇంకా డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో ఫోన్‌కు 12జి‌బి ర్యామ్ సపోర్ట్ లభిస్తుంది, దీనిని వర్చువల్‌గా 19జి‌బి వరకు విస్తరించవచ్చు. 256జి‌బి ఇంటర్నల్ UFS 3.1 స్టోరేజ్ ఫోన్‌లో ఇచ్చారు. మీకు కావాలంటే, మీరు TF కార్డ్‌తో స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 డూగీ వి మ్యాక్స్‌లో చూడవచ్చు. 

Latest Videos

undefined

 కెమెరా అండ్ బ్యాటరీ
ట్రిపుల్ కెమెరా సెటప్ డూగీ వి మ్యాక్స్‌లో అందించారు, దీనిలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 20-మెగాపిక్సెల్ నైట్ విజన్ సెన్సార్‌, మూడవ లెన్స్ 16-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ ఫోన్‌తో ఉంటుంది. సోని IMX350 ప్రైమరీ కెమెరాతో సపోర్ట్ చేస్తుంది.

22,000mAh పెద్ద బ్యాటరీ ఫోన్‌తో అందిస్తుంది. అయితే ఇంత పెద్ద బ్యాటరీని ఫోన్ తో ఛార్జ్ చేసేందుకు 33 వాట్ల చార్జర్ అందుబాటులోకి రానుంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం ఎన్‌ఎఫ్‌సి, 5G కనెక్టివిటీకి సపోర్ట్ ఇవ్వబడుతుంది. ఫోన్‌లో సెక్యూరిటి కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.

click me!