Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ మే 27 సోమవారం రోజున ఇండియాలో లాంచ్ చేసారు.
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్ (Samsung) తాజాగా కొత్త Galaxy F55 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 SoC ద్వారా రన్ అవుతుంది. దీనిలో 5,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. అంతేకాదు రెండు లెదర్(vegan) కలర్ అప్షన్స్ లో వస్తుంది.
Samsung Galaxy F55 దాని విభాగంలో అత్యంత తేలికైన ఇంకా స్లిమ్మెస్ట్ వేగన్ లెదర్ ఫోన్‌గా పేర్కొంది. ధర విషయానికొస్తే, Samsung Galaxy F55 5G 8GB RAM + 128GB ROM మోడల్ రూ. 26,999కి, 8GB RAM + 256GB ROM ధర రూ. 29,999, 12GB RAM + 256GB ROM వేరియంట్ ధర రూ. 32,999 ఉంది.
undefined
ఆప్రికాట్ క్రష్ ఇంకా రైసిన్ బ్లాక్ అనే రెండు అప్షన్స్ లో లభిస్తుంది, ఈ ఫోన్ మే 27న ఈరోజు సాయంత్రం 7 గంటలకు IST ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. Samsung Galaxy F55 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల పూర్తి-HD+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లే ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోగల స్టోరేజ్ కూడా ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy F55 5G 5,000mAh బ్యాటరీతో 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ నానో సిమ్-సపోర్ట్ ఉన్న ఫోన్ 5G, 4G, Wi-Fi, GPS, Glonass, Beidou, Galileo, QZSS, NFC, USB టైప్-సి కనెక్టివిటీని అందిస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.