నేను గ్రహాంతరవాసిని, కానీ ప్రజలు దీనిని నమ్మరు: టెస్లా సీఈఓ !

By Ashok kumar Sandra  |  First Published May 28, 2024, 12:51 AM IST

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా అండ్  స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ తాను గ్రహాంతర వాసి అని చెప్పినప్పటికీ ప్రజలు నమ్మడం లేదు అని అన్నారు. 
 


న్యూఢిల్లీ : తాజాగా ప్యారిస్‌లో జరిగిన వివా టెక్ ఈవెంట్‌కు టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ హాజరయ్యారు. ఈసారి గ్రహాంతర జీవుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారింది. మీరు గ్రహాంతర జీవి గురించి తరచుగా వింటున్నారా అని అడిగిన ప్రశ్నకు, ఎలోన్ మస్క్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు, అవును, నేను గ్రహాంతరవాసిని. ఇది నేను మొదటి నుంచి చెబుతున్నాను.

నేను గ్రహాంతరవాసిని అని చెప్తే  ఎవరూ నమ్మడం లేదు. అయితే గ్రహాంతర జీవులకు సంబంధించిన ఆధారాలు దొరికితే మాత్రం ఎక్స్ లో తప్పకుండా షేర్ చేస్తానని బిలియనీర్ వ్యాపారవేత్త తెలిపాడు. గ్రహాంతరవాసుల ఉనికి గురించి మాట్లాడుతూ, "బహుశా ఈ గెలాక్సీలో మనం ఒంటరిగా ఉండవచ్చు, ఇంకా అది మనమే కావచ్చు, మన స్పృహ చాలా బలహీనంగా ఉంది." అని అన్నారు. 

Latest Videos

undefined

ఎలోన్ మస్క్ మార్స్ పై జీవితం గురించి కూడా మాట్లాడాడు. "రాబోయే 10 సంవత్సరాలలో, బహుశా ఏడెనిమిదేళ్లలో, మనము అంగారక గ్రహంపై మొదటి మానవుడిని చూస్తామని నేను అనుకుంటున్నాను. అది SpaceX  లాంగ్ టర్మ్  టార్గెట్. మరింత నివాసయోగ్యమైన గ్రహాలను, స్థిరమైన మల్టి-ప్లానెటరీ  సివిలైజేషన్ నిర్మించడం, అది సాధ్యమైనప్పుడు , భూమి చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఆ సామర్ధ్యం తక్కువ వ్యవధిలో మాత్రమే తెరవబడుతుంది," అని  చెప్పాడు.

OpenAI అండ్ Google జెమినిని విమర్శిస్తూ, "AI నిజాయతీగా ఉండటానికి శిక్షణ పొందాలి. రాజకీయంగా సరైనదిగా నిర్మించబడకూడదు. రాజకీయంగా కరెక్ట్‌గా ఉండటం అంటే అది నిజం కాదు. మీరు AIకి అబద్ధం చెప్పడానికి శిక్షణ ఇస్తున్నారని అర్థం. ఈ రోజు ఖచ్చితంగా భవిష్యత్తులో మనల్ని మారుస్తుంది." AI ఉద్యోగాలను తీసివేస్తుందా అనే దాని గురించి మాట్లాడుతూ, ప్రజలు పని చేయని భవిష్యత్తును తాను ఊహించుకుంటున్నట్లు చెప్పాడు.

click me!