15వేలకే జియో ల్యాప్‌టాప్‌.. 4G సిమ్ కార్డ్ సపోర్ట్ కూడా.. వీరి కోసం ప్రత్యేకంగా..

By asianet news telugu  |  First Published Oct 3, 2022, 12:33 PM IST

నివేదిక ప్రకారం, రిలయన్స్ జియోబుక్ కోసం మైక్రోసాఫ్ట్ అండ్ క్వాల్కమ్‌తో భాగస్వామ్యం ఉంది. Qualcomm ప్రాసెసర్ జియోబుక్ లో అందించనున్నారు  అలాగే Microsoft Windows లభిస్తుంది. 


రిలయన్స్ జియో  బడ్జెట్ ల్యాప్‌టాప్ జియోబుక్  పై ఒక లీక్ రిపోర్ట్ బయటపడింది. నివేదిక ప్రకారం, జియోబుక్  రూ. 15,000 రేంజ్ లో ప్రారంభించనుందని, దీనికి 4G సిమ్ కార్డ్ సపోర్ట్ లభిస్తుందని తెలిపింది. 

నివేదిక ప్రకారం, రిలయన్స్ జియోబుక్ కోసం మైక్రోసాఫ్ట్ అండ్ క్వాల్కమ్‌తో భాగస్వామ్యం ఉంది. Qualcomm ప్రాసెసర్ జియోబుక్ లో అందించనున్నారు  అలాగే Microsoft Windows లభిస్తుంది. Microsoft కొన్ని యాప్‌లు JioBookలో ప్రీ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి, అయితే Jio నుండి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Latest Videos

undefined

జియోబుక్  ని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరిచయం చేయనుంది. అయితే విద్యార్థుల అవసరాన్ని బట్టి దీని ఫీచర్లు ఉంటాయి. జియోబుక్  తో పాటు జియో ఫోన్ 5G కూడా త్వరలో లాంచ్ కానుంది. గూగుల్ సపోర్టుతో జియో ఫోన్ 5జీ సిద్ధం అవుతుంది. 

జియోబుక్  కోసం, జియో ఒక అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన Flexతో భాగస్వామిగా ఉంది. జియోబుక్  వచ్చే ఏడాది మార్చి నాటికి దాదాపు ఒక మిలియన్ యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం భారతదేశం మొత్తం కంప్యూటర్ షిప్‌మెంట్లు 14.8 మిలియన్లుగా ఉన్నాయని రీసెర్చ్ సంస్థ IDC నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది.

జియోబుక్‌లోని కొన్ని యాప్‌లు మైక్రోసాఫ్ట్ నుండి వచ్చినవి అయితే ప్రాథమిక ఆపరేటింగ్ సిస్టమ్ జియో OS. జియోబుక్  కోసం కస్టమర్లు జియో స్టోర్ నుండి ల్యాప్‌టాప్‌లకు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు జియో 5G లాంచ్ కూడా ఈ దీపావళికి జరగబోతోంది.

click me!