ప్రపంచంలోనే మొట్టమొదటి 210W ఛార్జింగ్ ఫోన్‌.. 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్..

By asianet news telugu  |  First Published Oct 1, 2022, 12:36 PM IST

ఒక నివేదిక ప్రకారం, రెడ్‌మి నోట్ 12 సిరీస్ ప్రో ప్లస్ ఫోన్ 210W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించనుంది. అలా చేస్తే ఈ ఫోన్ అత్యంత ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే ఫోన్ అవుతుంది. 


ప్రపంచంలోనే మొట్టమొదటి 210W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ రెడ్ మీ నోట్ 12 ప్రొ ప్లస్ ని లాంచ్ చేసేందుకు రెడ్ మీ సిద్దమైంది. కంపెనీ కొత్త రెడ్‌మి నోట్ 12 సిరీస్‌లో ఈ ఫోన్‌ విడుదల కానుంది. రెడ్‌మి నోట్ 12 అండ్ రెడ్‌మి నోట్ 12ప్రొ కూడా ఈ సిరీస్ కింద లాంచ్ అవుతాయి. రెడ్‌మి నోట్ 12 సిరీస్‌ను ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే 2023 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనుంది. ఈ సిరీస్ చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ (3C) డేటాబేస్‌లో నిరంతరం వీక్షించబడుతోంది. 

ఒక నివేదిక ప్రకారం, రెడ్‌మి నోట్ 12 సిరీస్ ప్రో ప్లస్ ఫోన్ 210W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించనుంది. అలా చేస్తే ఈ ఫోన్ అత్యంత ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే ఫోన్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో 150W ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మి నోట్ 12 ప్రొ,రెడ్‌మి నోట్ 12 ప్రొ ప్లస్ ఫోన్‌లు 3C డేటాబేస్‌లో మోడల్ నంబర్లు 22101316UCP, 22101316UCతో కనిపించాయి.

Latest Videos

undefined

క్లెయిమ్ ప్రకారం, రెడ్‌మి నోట్ 12 ప్రొ 120W అండ్ రెడ్‌మి నోట్ 12 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో  వస్తాయి. రెడ్‌మి నోట్ 12 ప్రొ + ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్‌ప్లేతో అందించబడుతుంది, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌ను పొందుతుంది. 4,300mAh బ్యాటరీ ప్రో ప్లస్ మోడల్‌తో, 4,980mAh బ్యాటరీ ప్రోతో రానుంది. 

రెడ్‌మి నోట్ 12 Pro Plusకి MediaTek Dimensity 8000 ప్రాసెసర్‌తో రవొచ్చు. అలాగే, Redmi Note 12 Proలో MediaTek Dimensity 1300ని అందించవచ్చు. Redmi Note 12 సిరీస్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుతూ ఫోన్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ చూడవచ్చు. 

click me!