జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు వాట్సాప్‌ ద్వారా ఒక్క మెసేజ్ తో రీఛార్జ్ చేయవచ్చు..

By asianet news teluguFirst Published Jun 9, 2021, 5:26 PM IST
Highlights

జియో యూజర్లు ఇప్పుడు వాట్సాప్‌ ద్వారా మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేయవచ్చు. దీనితో పాటు మీరు పేమెంట్, ఇతర సౌకర్యాలను కూడా ఆస్వాదించవచ్చు. 
 

 టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులకు మొబైల్ రీఛార్జ్  మరింత సులభం అవుతుంది. ఇప్పుడు జియో యూజర్లు నేరుగా వాట్సాప్ నుండి రీఛార్జ్ చేసుకోవచ్చు.

దీనితో పాటు మీరు పేమెంట్, ఇతర సౌకర్యాలను కూడా ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా మీరు రీఛార్జికి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలను పొందవచ్చు. తాజాగా రిలయన్స్  జియో వాట్సాప్‌తో జతకట్టింది.

తద్వారా అత్యంత వినూత్నమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో తీసురానుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో సాధారణంగా వాట్సాప్ ఉంటుంది. అలాగే జియో ఫైబర్, జియోమార్ట్‌ను కూడా వాట్సాప్ నుంచి యాక్సెస్ చేయవచ్చు.

also read 

వాట్సాప్ ద్వారా  రీఛార్జ్ ఎలా అంటే ?

మీరు వాట్సాప్ నుండి జియో సిమ్‌ను రీఛార్జ్ చేయాలనుకుంటే, మీరు మీ మొబైల్ ఫోన్‌లో 70007 70007 నంబర్‌ను మొదట  సేవ్ చేసుకోవాలి. తరువాత వాట్సాప్ లో 7000777007 నంబరుకి  హాయ్ అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. దీని తరువాత రీఛార్జ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

అలాగే వినియోగదారులు రీఛార్జ్ ప్లాన్‌లను యాక్సెస్ చేయవచ్చు, బ్రౌస్ చేయవచ్చు. ఇంకా వాట్సాప్ నుండి అన్ని రకాల చెల్లింపుల కోసం ఇ-వాలెట్, యుపిఐ, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులు వంటి అన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 

click me!