Jio Recharge Plans:డైలీ డేటా లిమిట్ అయిపోయిందని ఆందోళన చెందుతున్నారా.. ఈ ప్లాన్‌లు మీకు ప్రత్యేకమైనవి

Ashok Kumar   | Asianet News
Published : May 17, 2022, 06:06 PM IST
Jio Recharge Plans:డైలీ డేటా లిమిట్ అయిపోయిందని ఆందోళన చెందుతున్నారా.. ఈ ప్లాన్‌లు మీకు ప్రత్యేకమైనవి

సారాంశం

ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీ డైలీ డేటా త్వరగా దాటితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జియో  మీకు గొప్ప రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది, ఇందులో మీరు డైలీ డేటా పరిమితిని పొందుతారు. 

ఇండియాలో పెద్ద సంఖ్యలో ప్రజలు టెలికాం సేవలను ఆస్వాదిస్తున్నారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలు వివిధ పనుల కోసం పెద్ద ఎత్తున ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీ డైలీ డేటా త్వరగా దాటితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జియో  మీకు గొప్ప రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది, ఇందులో మీరు డైలీ డేటా పరిమితిని పొందుతారు.

ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకున్నా తర్వాత, ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మీ డైలీ డేటా పరిమితి మించదు ఇంకా మీరు ఎటువంటి అంతరాయం లేకుండా ఎక్కువ కాలం ఇంటర్నెట్‌ను ఉపయోగించగలరు. ఈ ప్లాన్‌లతో మీరు డైలీ డేటా పరిమితి కాకుండా ఎన్నో ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. వీటిలో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు OTT ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం..

జియో రూ. 601 రీఛార్జ్ ప్లాన్
జియో ఈ ప్లాన్ ధర రూ. 601. దీనితో మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 3 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ప్లాన్‌తో మీరు అదనంగా 6 GB ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత మీ మొబైల్‌లో డైలీ డేటా లిమిట్ అయిపోతుందనే సమస్య పూర్తిగా తొలగిపోతుంది.

అంతేకాకుండా ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు మీరు ప్లాన్‌తో రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లను కూడా పొందుతారు. అదనపు బెనెఫిట్స్ లో మీరు డిస్నీ హాట్‌స్టార్ మొబైల్  ఆన్యువల్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్ మీకు చాలా ప్రత్యేకమైనది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత మీరు Jio TV, Jio సినిమా మొదలైన Jio ఇతర యాప్‌లను ఆస్వాదించగలరు.

జియో రీఛార్జ్ ప్లాన్ రూ. 4199
మీరు డైలీ డేటా లిమిట్ అయిపోతుందనే సమస్య లేని రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ జియో ప్లాన్ చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 4199.దీనితో మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 3GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. అంతేకాకుండా మీరు ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో  ప్రతిరోజూ 100 SMS సౌకర్యాన్ని కూడా పొందుతారు. 

ఇంకా  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం మెంబర్‌షిప్ అదనపు బెనెఫిట్స్ లో ఒక సంవత్సరం పాటు అందుబాటులో ఉంటుంది. ప్లాన్‌ని రీఛార్జ్ చేసిన తర్వాత మీరు Jio TV, Jio సినిమా మొదలైన Jio  ఇతర యాప్‌లను ఆస్వాదించగలరు.

PREV
click me!

Recommended Stories

Arattai : వాట్సాప్ కు పోటీగా స్వదేశీ మెసేజింగ్ యాప్.. అరట్టై డౌన్లోడ్ చేసేముందు ఇవి తెలుసుకొండి
2027 నాటికి మీ ఉద్యోగం ఉంటుందా? ఉండదా? : ఎడిటర్ కాలమ్