Cyber ​​Security Tips:ఈ విషయాలను గుర్తుంచుకుంటే..మీ స్మార్ట్ ఫోన్ పై సైబర్ దాడి జరగదు..

Ashok Kumar   | Asianet News
Published : May 17, 2022, 03:35 PM IST
Cyber ​​Security Tips:ఈ విషయాలను గుర్తుంచుకుంటే..మీ స్మార్ట్ ఫోన్ పై సైబర్ దాడి జరగదు..

సారాంశం

ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత సైబర్ మోసాలకి సంబంధించిన సంఘటనల సంఖ్య పెరిగింది.  ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు మీరు సైబర్ మోసాలను నివారించడానికి అప్రమత్తంగా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 

ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంటర్నెట్ మనకు వర్చువల్ ప్రపంచాన్ని అందించింది, దీనిలో మన పని అంతా చాలా సులభంగా జరుగుతుంది. అలాగే సైబర్ మోసాల కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత సైబర్ మోసాలకి సంబంధించిన సంఘటనల సంఖ్య పెరిగింది.  ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు మీరు సైబర్ మోసాలను నివారించడానికి అప్రమత్తంగా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీ ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు.  మీరు తప్పనిసరిగా ఆ జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి, వీటిని అనుసరించడం ద్వారా సైబర్ మోసాలని నివారించవచ్చు.  వీటిని అనుసరిస్తే మీ డివైజ్ పై సైబర్ దాడి  అవకాశాలు బాగా తగ్గుతాయి.  

లాటరీలు లేదా  టెంప్టింగ్ ఆఫర్‌లు
లాటరీలు లేదా ఏదైనా రకమైన ఆఫర్ల  పేర్లతో సైబర్ దుండగులు ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం తరచుగా కనిపిస్తుంది. ఎవరైనా మీకు ఆన్‌లైన్‌లో లేదా ఫోన్ కాల్ ద్వారా  ఏదైనా బహుమతి లేదా లాటరీని ఆఫర్ చేస్తే ఇలాంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. దీనిని ఫిషింగ్ దాడి అని కూడా అంటారు. మీకు అలాంటి కాల్ వచ్చినప్పుడు మీరు వెంటనే ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేయండి. 

ఉచిత వై-ఫై
ఫ్రీ ఇంటర్నెట్‌ పొందడానికి ప్రజలు ఏదైనా ఉచిత వై-ఫైని ఉపయోగించడం తరచుగా కనిపిస్తుంది. మీరు కూడా అదే తప్పు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్‌ను ఏ పబ్లిక్ ప్లేస్‌లోనూ అనధికార వైఫైకి కనెక్ట్ చేయవద్దు. ఇలా చేయడం ద్వారా మీ ఫోన్ హ్యాక్ చేయవచ్చు ఇంకా మీ ప్రైవేట్ డేటాను సంబంధిత హ్యాకర్ యాక్సెస్ చేయవచ్చు. 

జాగ్రత్తగా ఇమెయిల్ ఉపయోగించండి
గత కొన్ని సంవత్సరాలుగా, సైబర్ నేరగాళ్లు ఇమెయిల్ ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఎన్నో కేసులు తెరపైకి వచ్చాయి. మీరు హెచ్చరికతో ఇమెయిల్ ఉపయోగించాలి. సైబర్ దాడి చేసేవారు మీ ఇమెయిల్‌కి  ఫిషింగ్ లింక్‌ను పంపడం ద్వారా మీ డివైజ్ పై దాడి చేయవచ్చు. ఇందుకు మీరు ఇమెయిల్‌లోని ఏదైనా అనవసరమైన లింక్‌పై క్లిక్ చేయకూడదు.

పాస్ వర్డ్ 
మీరు సైబర్ మోసాలని నివారించాలనుకుంటే మీ లాగిన్ అకౌంట్స్ పాస్‌వర్డ్‌ను బలంగా పెట్టుకోండి. బలమైన పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టం. మీరు ఎల్లప్పుడూ మీ పాస్‌వర్డ్‌లో 8 కంటే ఎక్కువ అంకెలను ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా మీ పాస్‌వర్డ్‌లో పెద్ద అక్షరం, చిన్న అక్షరం, ప్రత్యేక అక్షరాలు  నంబర్లు ఉండేలా చూసుకోండి.

PREV
click me!

Recommended Stories

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్