ఎయిర్‌టెల్‌కు పోటీ: ఏడాది జియో ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ ఆఫర్

By narsimha lode  |  First Published Jun 7, 2020, 1:46 PM IST

 టెలికం సంచలనం రిలయన్స్ జియో తాజాగా తన వినియోగ దారులకు మరో అద్భుతమైన ఆఫర్ ముందుకు తీసుకొచ్చింది. తమ ప్రీ పెయిడ్ వినియోగదారులకు డిస్నీ-హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ఏడాది పాటు ఇవ్వాలని నిర్ణయించింది.


న్యూఢిల్లీ: టెలికం సంచలనం రిలయన్స్ జియో తాజాగా తన వినియోగ దారులకు మరో అద్భుతమైన ఆఫర్ ముందుకు తీసుకొచ్చింది. తమ ప్రీ పెయిడ్ వినియోగదారులకు డిస్నీ-హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ఏడాది పాటు ఇవ్వాలని నిర్ణయించింది.

అయితే, రూ.401 నెలవారీ రీచార్జి ప్లాన్, రూ.2,559 వార్షిక ప్లాన్, రూ.612, రూ.120 డేటా ఓచర్లలో ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆపర్‌ను సోషల్ మీడియాలో రిలయన్స్ జియో వెల్లడించింది.

Latest Videos

also read:5% తక్కువకే: తెలుగు రాష్ట్రాల్లో జియోమార్ట్ సేవలు ప్రారంభం...

అదే సమయంలో జియో ప్రీ పెయిడ్ వినియోగదారులు తమ ప్రీపెయిడ్ కనెక్షన్‌ను ఎప్పటికీ ఏదో ఒక ప్యాకేజీతో రీచార్జీ చేసుకుంటూ ఉండాలి. ఈ ఆఫర్ ఎంతకాలం అమలులో ఉంటుందన్న విషయం రిలయన్స్ జియో వెల్లడించలేదు. 

వినియోగదారుల నుంచి భారీ స్పందన లభించడంతో శనివారం రాత్రి వివరాలతోపాటు రిలయన్స్ జియో ఈ ప్లాన్ ఆవిష్కరించింది. ఈ తరహా ఆఫర్ ఇప్పటికే ఎయిర్ టెల్ అందిస్తున్నది. రూ.401తో రీచార్జి చేసుకునే వారికి ఏడాదిపాటు డిస్నీప్లస్ హాట్ స్టర్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. ఎయిర్ టెల్ సంస్థకు పోటీగా ఇప్పుడు రిలయన్స్ జియో కూడా ఈ ఆఫర్ అందించడానికి ముందుకు వచ్చింది. 

also read:కార్టూన్ సాకుగా ‘భారత్’పై ట్విట్టర్ వివక్ష.. అమూల్ రిక్వెస్ట్ తర్వాత రీస్టోర్

ఈ ఆఫర్‌లో మార్వెల్, స్టార్ వార్స్, ఫిక్సర్, డిస్నీ మూవీలు, హాట్ స్టర్ స్పెషల్స్, కిడ్స్ ప్రోగ్రామ్స్, లైవ్ స్పాట్లు తదితరాలు అందుబాటులో ఉంటాయి. రీచార్జీ ప్లాన్ అవసరం లేదనుకున్న వారు రూ.612 లేదా రూ.1208 డేటా ఓచర్ పొందితే ఏడాదిపాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సేవలు ఉచితంగా లభిస్తాయి. 

రూ.612 జియో డేటా ఓచర్‌లో 72జీబీ టోటల్ హై స్పీడ్ డేటాతోపాటు ఇతర మొబైల్ ఫోన్లకు ఆరు వేల నిమిషాల వరకు కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆఫర్ కొనసాగుతూ ఉంటే రూ.1208 ఆఫర్ కింద జియో డేటా ఓచర్ 240 జీబీ టోటల్ హైస్పీడ్ డేటాను 240 రోజులు అందిస్తుంది. 
 

click me!