క్లౌడ్ డేటా: మైక్రోసాఫ్ట్ తో రిలయన్స్ జట్టు

By rajesh yFirst Published Aug 13, 2019, 10:52 AM IST
Highlights

క్లౌడ్ డేటా కోసం సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో రిలయన్స్ జియో జత కట్టింది. 

న్యూఢిల్లీ: దేశీయ డిజిటల్ రంగంలో సరి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్రపంచమే భారతదేశం వైపు చూసే సమయం ఆసన్నమైంది. 

ఇప్పటికే జియోతో జిల్జిల్ జిగేల్ అంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రపంచ నంబర్ వన్ సాఫ్ట్ వేర్ సంస్థ  మైక్రోసాఫ్ట్‌తో జత కట్టింది. భారత డిజిటల్ రూపు రేఖలు మరింత మెరుగుపర్చేందుకు దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంది. 

దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నది రిలయన్స్ జియో. దానికి అవసరమయ్యే ‘అజుర్’ కంప్యూటర్ అప్లికేషన్ను మైక్రోసాఫ్ట్ అందించనుంది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేశ్ అంబానీ సోమవారం సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ సంగతి చెప్పారు. భారతీయ టెక్నాలజీ స్టార్టప్‌లకు జియో కనెక్టివిటీతో పాటు జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్‌ను ఉచితంగానే అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిన్న స్థాయి వ్యాపార సంస్థలకు అవసరమయ్యే కనెక్టివిటీ సమూహాన్ని, ఆటోమేషన్ టూల్స్‌ను నెలకు కేవలం రూ.1500లకే అందించనున్నట్లు  ముఖేశ్ అంబానీ ప్రకటించారు.

click me!