ఇప్పటివరకూ ఆప్టికల్-ఫైబర్‌ను విస్తరించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ప్రతి మారుమూల ప్రాంతాల్లోని ఇల్లు, చిన్నవ్యాపారులకు నాణ్యమైన హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా జియోఎయిర్‌ఫైబర్ సర్వీసులను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని 45 నగరాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం రిలయన్స్ జియో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఎయిర్‌ఫైబర్ సర్వీసులను మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో ఎయిర్ ఫైబర్ సర్వీసులను విస్తరించిన జియో.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, స్మార్ట్ హోమ్ సర్వీసులు, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ ఎయిర్‌ఫైబర్ సర్వీసులను విస్తరించినట్టు ప్రకటించింది.
ఇప్పటివరకూ ఆప్టికల్-ఫైబర్‌ను విస్తరించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ప్రతి మారుమూల ప్రాంతాల్లోని ఇల్లు, చిన్నవ్యాపారులకు నాణ్యమైన హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా జియోఎయిర్‌ఫైబర్ సర్వీసులను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని 45 నగరాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నగరాల్లోని అన్ని ఇళ్లు, వ్యాపార సంస్థలు ఇప్పుడు ప్రపంచ స్థాయి లేటెస్ట్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా పొందవచ్చు. ఈ నగరాలన్నింటిలో కస్టమర్ల ప్రాంగణంలోనే అనేక జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లను ఏర్పాటు చేసింది.
ఈ సందర్బంగా జియో ఆంధ్రప్రదేశ్ ఈఓఎం మహేష్ కుమార్ మాట్లాడుతూ "జియోఎయిర్‌ఫైబర్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇళ్లు, వ్యాపార సంస్థలు ప్రపంచ స్థాయి లేటెస్ట్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అనుభవాన్ని సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా పొందవచ్చునని తెలిపారు. ఏపీలో జియోఎయిర్‌ఫైబర్ విస్తరణతో రాష్ట్ర యువతకు అత్యాధునిక కనెక్టివిటీ పరిష్కారాలను అందించడంలో సాయపడుతుందని ఆయన అన్నారు.
జియోఎయిర్‌ఫైబర్ ప్లాన్లు :
జియోఎయిర్‌ఫైబర్ టీవీ లేదా బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు ప్రపంచ స్థాయి లేటెస్ట్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అనుభవానికి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాన్ని అందిస్తుంది. సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా అన్నింటిని ఒకేసారి పొందవచ్చు. జియోఎయిర్‌ఫైబర్ సర్వీసుల ద్వారా రూ. 599 ప్లాన్‌పై 30ఎంబీపీఎస్ స్పీడ్ తో అన్ లిమిటెడ్ డేటాను పొందవచ్చు. రూ. 899 ప్లాన్, రూ.1199 ప్లాన్ కింద 100ఎంబీపీఎస్ స్పీడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లతో 550కు పైగా డిజిటల్ టీవీ ఛానెల్‌లు, ప్రముఖ ఓటీటీయాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
అంతేకాదు 14 ప్రముఖ ఓటీటీప్లాట్‌ఫామ్‌లు రూ. 599, రూ. 899 ప్లాన్‌లతో అందుబాటులో ఉన్నాయి. రూ. 1199 ప్లాన్ కింద నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియంతో సహా 16కు పైగా ప్రముఖ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. మరింత సమాచారంతో పాటు కనెక్షన్ పొందడానికి 60008-60008కి కాల్ చేయొచ్చు లేదంటే www.jio.com వెబ్‌సైట్లో లాగిన్ చేయవచ్చు.
జియోఫైబర్ లాగానే జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసులు :
* డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ 550+ డిజిటల్ టీవీ ఛానెల్‌లు : మీకు ఇష్టమైన అన్ని టీవీ ఛానెల్‌లు హై-డెఫినిషన్‌లో చూడవచ్చు.
* క్యాచ్-అప్ టీవీ : వినియోగదారులు తమకు ఇష్టమైన షోలను క్యాలెండర్ ప్రకారం చూడవచ్చు.
* మోస్ట్ పాపులర్ 16కు పైగా ఓటీటీ యాప్‌లు : జియో ఎయిర్‌ఫైబర్ వినియోగదారులు ఓటీటీ యాప్‌లకు ఫ్రీ యాక్సస్ పొందవచ్చు. వినియోగదారులు ఈ సబ్‌స్క్రిప్షన్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టాబ్లెట్ వంటి వారికి నచ్చిన ఏదైనా డివైజ్‌లలో ఉపయోగించవచ్చు.
జియో బ్రాడ్‌బ్యాండ్‌తో మరిన్ని బెనిఫిట్స్ :
ఇండోర్ వైఫై సర్వీస్ : జియో వై-ఫై కనెక్టివిటీతో మీ ఇల్లు లేదా వ్యాపార ప్రాంగణంలో హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఆక్సస్ చేసుకోవచ్చు.
* స్మార్ట్ హోమ్ సర్వీసులు
* విద్య, వర్క్ ఫ్రమ్ హోం కోసం క్లౌడ్ పీసీ
* సెక్యూరిటీ, నిఘా పరిష్కారాలు
* స్మార్ట్ హోమ్ ఐఓటీ
* గేమింగ్
* హోమ్ నెట్‌వర్కింగ్
* విద్య
* ఆరోగ్య సంరక్షణ
JIO ఎయిర్‌ఫైబర్ పొందడానికి:
స్టెప్ 1: Jioని చేరుకోండి
* WhatsAppలో బుకింగ్ ప్రారంభించడానికి 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా www.jio.comని ఓపెన్ చేయండి లేదా మీ సమీపంలోని జియో స్టోర్‌ని సందర్శించండి
స్టెప్ 2: మీ JioAirFiber కనెక్షన్‌ని బుక్ చేయండి. ఇప్పుడు కొన్ని సులభమైన దశల్లో JioAirFiber సేవల కోసం రిజిస్టర్ చేసుకోండి
స్టెప్ 3: కన్ఫర్మేషన్ పొందండి
Jio మీ ప్రాంగణంలో సేవలు సిద్ధమైన వెంటనే మీతో కాంటాక్ట్ జరుపుతుంది ఇంకా మీ ప్రాధాన్యతపై ఇంటికి కనెక్ట్ చేస్తుంది.
అదనపు ఖర్చు లేకుండా హోం అప్లియన్సెస్ :
* మీ ఇల్లు లేదా వ్యాపార ప్రాంగణంలో వై-ఫై రూటర్ కవరేజ్ పొందవచ్చు.
* 4కె స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్ కూడా పొందవచ్చు .
* వాయిస్-యాక్టివ్ రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు.