ఎవరికైనా ఏదైనా కంపెనీకి చెందిన 5జి స్మార్ట్‌ఫోన్ ఉంటే అందులో 5జి ఎస్‌ఏ నెట్‌వర్క్ కి జియో సపోర్ట్ చేస్తుందా..? భారతీయ మార్కెట్లో అన్నీ కంపెనీల 5జి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి, అయితే బ్యాండ్‌కు సంబంధించి చాలా మందికి సమస్యలు ఉండవచ్చు.
దీపావళి నాటికి 5జీ నెట్‌వర్క్ ప్రారంభమవుతుందని దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా తెలిపింది. అయితే జియో స్టాండ్ ఆలోన్ (SA) 5జి నెట్‌వర్క్‌ని తీసుకువస్తుందని, 4జి నెట్‌వర్క్‌పై ఆధారపడటం ఉండదని తెలిపింది అంటే జియో 5జి ఎస్‌ఏ కోసం ప్రత్యేకంగా పూర్తి మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తుంది. ఎవరికైనా ఏదైనా కంపెనీకి చెందిన 5జి స్మార్ట్‌ఫోన్ ఉంటే అందులో 5జి ఎస్‌ఏ నెట్‌వర్క్ కి జియో సపోర్ట్ చేస్తుందా..? భారతీయ మార్కెట్లో అన్నీ కంపెనీల 5జి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి, అయితే బ్యాండ్‌కు సంబంధించి చాలా మందికి సమస్యలు ఉండవచ్చు. మీరు జియో 5జి సిమ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా మీ ఫోన్ జియో 5జి ఎస్‌ఏకి సపోర్ట్ ఇస్తుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం, జియో 5Gకి సపోర్ట్ ఇచ్చే అన్ని స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ చూద్దాం.
జియో 5జి ఎస్‌ఏ బ్యాండ్‌లు
ముందుగా జియో 5G నెట్‌వర్క్ n3, n5, n28, n77 అండ్ n78 బ్యాండ్‌లకు సపోర్ట్ ఇస్తుంది ఇంకా జియో సేవలు మొత్తం 22 సర్కిల్‌లలో అందుబాటులో ఉంటాయి. ముందుగా ఈ సర్వీసెస్ మెట్రో సిటీ నుండి ప్రారంభమవుతాయి. మీ ఫోన్‌లో ఈ బ్యాండ్‌లకు సపోర్ట్ ఉందో లేదో తెలుసుకోవడం కూడా మీకు చాలా ముఖ్యం.
undefined
షియోమీ, రెడ్ మీ అండ్ పోకో ఫోన్స్
షియోమీ , రెడ్ మీ, పోకో 5జి ఎస్‌ఏ అండ్ 5జి ఎన్‌ఎస్‌ఏ (నాన్-స్టాండలోన్) 5కి నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తాయి. ఎన్‌ఎస్‌ఏ సపోర్ట్ ఉన్న అన్ని ఫోన్‌లకు ఓటిఏ ద్వారా 5జి ఎస్‌ఏ సపోర్ట్ ఉంటుందని షియోమీ తెలిపింది. షియోమీ 11 లైట్ ఎన్‌ఈ 5జి నుండి షియోమీ 12 ప్రొ వరకు జియో అన్ని ఫోన్‌లలో 5జి సపోర్ట్ చేస్తుంది. రెడ్ మీ K50i 5జి నుండి రెడ్ మీ నోట్ 11టి 5జి వరకు ఎస్‌ఏ సపోర్ట్ చేస్తుంది, కాబట్టి జియో 5జి వీటిలో పని చేస్తుంది. పోకో ఎం4 5జి నుండి ఎక్స్4 ప్రొ 5జి వరకు ఎన్‌ఎస్‌ఏ అండ్ ఎస్‌ఏ నెట్‌వర్క్‌లకు సపోర్ట్ ఉంది.
5జి సపోర్ట్ చేసే రియల్ మీ ఫోన్‌లు
రియల్ మీ 9ఐ 5జి ఎన్‌ఎస్‌ఏ ఇంకా ఎస్‌ఏ 5జేఐ బ్యాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా జియో 5జి రియల్ మీ 9 ప్రొ ప్లస్ 5జి, రియల్ మీ 9 ప్రొ 5జిలో కూడా రన్ అవుతుంది. రియల్ మీ జిటి సిరీస్ ఎన్‌ఎస్‌ఏ, ఎస్‌ఏ 5జి నెట్‌వర్క్‌లు రెండూ కూడా సపోర్ట్ చేస్తాయి. ఇతర ఫోన్‌లలో 5జి ఎస్‌ఏ గురించి రియల్ మీ ఎలాంటి సమాచారం చెప్పలేదు, కానీ ఒక అప్ డేట్ తర్వాత జియో 5జి రియల్ మీ ఎన్‌ఎస్‌ఏ నెట్‌వర్క్ ఫోన్‌లో కూడా పనిచేయడం ప్రారంభిస్తుంది.
5జి సపోర్ట్ చేసే వన్ ప్లస్ ఫోన్‌లు
వన్ ప్లస్ 8 సిరీస్ నుండి మొదటి వన్ ప్లస్ నార్డ్ 5జి వరకు 5జి సపోర్ట్ ఉంది, అయితే ఈ ఫోన్‌లలో n78 బ్యాండ్‌పై కూడా విమర్శిలు వచ్చాయి. వన్ ప్లస్ నార్డ్ ఫోన్‌లో ఎన్‌ఎస్‌ఏ లేదా ఎస్‌ఏ 5జి సపోర్ట్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వన్ ప్లస్ 9 సిరీస్‌తో n41, n78 సపోర్ట్ ఉంది అంటే 5G SA ఇంకా NSA సపోర్ట్ ఈ సిరీస్ ఫోన్‌లో ఉంటుంది. వన్ ప్లస్ నార్డ్ 2 5జి, నార్డ్ సిఈ 2 5G కాకుండా వన్ ప్లస్ నార్డ్ సిఈ 2 లైట్ ఎన్నో బ్యాండ్‌లకు సపోర్ట్ ఉంది. జియో 5G వన్ ప్లస్ 10 ప్రొ, వన్ ప్లస్ 10ఆర్, వన్ ప్లస్ 10Tలలో పని చేస్తుంది.