అమెజాన్‌ సీఈవో పదవి జెఫ్ బెజోస్‌ బై.. బై.. ఉద్యోగులకు పంపిన లేఖ ద్వారా వెల్లడి..

By S Ashok KumarFirst Published Feb 3, 2021, 11:18 AM IST
Highlights

57 ఏళ్ల జెఫ్ బెజోస్  స్థానంలో  అమెజాన్  క్లౌడ్-కంప్యూటింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఆండీ జాస్సీ నూతన సి‌ఈ‌ఓగా నియామకం కానున్నారు.

అమెజాన్‌ను ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌గా స్థాపించి షాపింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా నిర్మించిన అత్యంత ధనవంతుడు, అమెజాన్ సి‌ఈ‌ఓ  జెఫ్ బెజోస్ ఈ ఏడాది చివరికల్ల సిఇఒ పదవి నుంచి వైదొలగనున్నట్లు స్వయంగా ప్రకటించారు.   

57 ఏళ్ల జెఫ్ బెజోస్  స్థానంలో  అమెజాన్  క్లౌడ్-కంప్యూటింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఆండీ జాస్సీ నూతన సి‌ఈ‌ఓగా నియామకం కానున్నారు.

ఉద్యోగులకు ఒక బ్లాగ్ పోస్ట్‌లో  అమెజాన్‌ అంటే ఒక ఆవిష్కరణ. ఇప్పటి వరకు అమెజాన్‌ను కనిపెట్టుకుంటూ వచ్చాను, ఇక ఈ పదవి నుంచి మారడం సరైన సమయం. ఈ ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికానికల్లా పదవి నుంచి తప్పుకొని ఆండీ జెస్సీకి పగ్గాలు  అందజేయనున్నాను. అయితే ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతాను. బెజోస్‌ ఎర్త్ ఫండ్‌, బ్లూ ఆర్జిన్‌ స్పేష్‌ షిప్‌, అమోజాన్‌ డే 1 ఫండ్‌పై మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ‌

 "జెఫ్ బెజోస్ అమెజాన్ ని విడిచి వెళ్ళడం లేదు" అని అమెజాన్  చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రియాన్ ఒల్సావ్స్కీ విలేకరులతో  చెప్పారు.  

చిన్నతనంలో జెఫ్ బెజోస్ కు కంప్యూటర్ల పట్ల ఆసక్తి ఎక్కువ. తన తల్లిదండ్రుల ఇంటిలో అలారం వంటి వస్తువులను నిర్మించటానికి ఆసక్తి కనబరిచేవాడు. అతను ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పొందాడు, తరువాత వాల్ స్ట్రీట్ కంపెనీలలో పనిచేశాడు.

అతను ఉద్యోగం మానేశాక ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి  మొదట  ఆన్‌లైన్ బుక్ స్టోర్  పై దృష్టి పెట్టాడు.  అతని మాజీ భార్య మాకెంజీ స్కాట్ ని 1993లో వివాహం చేసుకున్నారు.

 జెఫ్ బెజోస్ అమెజాన్.కామ్ లో తన తల్లిదండ్రులను, కొంతమంది స్నేహితులను  ఇందులో పెట్టుబడులు పెట్టమని కోరాడు.

కరోనా మహమ్మారి సమయంలో లాభం పొందిన కొద్దిమంది రిటైలర్లలో అమెజాన్ ఒకటి.  2020 చివరి మూడు నెలల్లో కంపెనీ రికార్డు స్థాయిలో లాభాలను కూడా ఆర్జించింది, దాని త్రైమాసిక ఆదాయం మొదటిసారిగా 100 బిలియన్ డాలర్లను దాటింది.

దీంతో జెఫ్ బెజోస్ సంపద కూడా పెరిగింది. అమెజాన్‌లో అతని వాటా ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లు. కొన్నేళ్లుగా కంపెనీ నడుపుతూ తెరవెనుక ఉండిపోయాడు. ఇటీవల, అతను కొన్నిసార్లు సినిమా ప్రీమియర్లలో, హాలీవుడ్ పార్టీలలో కనిపిస్తూ వెలుగులోకి వచ్చాడు.

2019లో అతను తన మాజీ భార్య మెకంజీ  స్కాట్‌ నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ట్వీట్‌లో ప్రకటించాడు, నేషనల్ ఎన్‌క్వైరర్ ఒక కవర్ స్టోరీని ప్రచురించడానికి ముందే జెఫ్ బెజోస్‌కు మాజీ టీవీ హోస్ట్‌తో సంబంధం ఉందని తెలిపాడు.  
  
సిఇఒగా ఉన్న ఒక పెద్ద టెక్ సంస్థ  చివరి వ్యవస్థాపకులలో బెజోస్ ఒకరు. గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు అందరూ తాము స్థాపించిన సంస్థల నుండి తప్పుకున్నారు. ఫేస్‌బుక్‌ను ఇప్పటికీ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వం వహిస్తున్నారు. ఆండీ జాస్సీ  1997 నుండి కంపెనీలో పనిచేసిన దీర్ఘకాల అమెజాన్ ఎగ్జిక్యూటివ్.  

click me!