NASA: ఈ సృష్టిలో మ‌నం ఒంటరి కాదా? ఆ గ్రహంపై నిజంగానే జీవం ఉందా.?

Published : May 28, 2025, 04:00 PM IST
NASA: ఈ సృష్టిలో మ‌నం ఒంటరి కాదా? ఆ గ్రహంపై నిజంగానే జీవం ఉందా.?

సారాంశం

సృష్టిలో భూమిపై మాత్ర‌మే కాకుండా ఇత‌ర గ్ర‌హాల‌పై కూడా జీవులు ఉన్నాయ‌న్న‌ది ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తోన్న వాద‌న‌. అయితే ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌న్న‌దానిపై మాత్రం ఇంత వ‌ర‌కు స్ప‌ష్ట‌త రావ‌డం లేదు.

ఈ సృష్టిలో జీవం ఉండే అవ‌కాశం ఉన్న గ్ర‌హం ఏదైనా ఉందంటే అది మార్స్ అని చాలా మంది శాస్త్ర‌వేత్తలు భావిస్తున్నారు. దశాబ్ధాలుగా ఈ గ్రహం మానవాళి ఊహలను రేకెత్తిస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథల నుంచి బిలియన్ డాలర్ల అంతరిక్ష యాత్రల వరకు. కానీ ఒక ప్రశ్న శాస్త్రవేత్తలను ఆకర్షిస్తూనే ఉంది. అదే మార్స్ మీద జీవం ఉందా లేదా ఉందా? 

శాస్త్రవేత్తల ఉద్దేశంలో "జీవం" అంటే?

ఇతర గ్రహంపై జీవం అంటే కేవలం మనిషిని పోలిన వ్యక్తి కోసం మాత్రమే అన్వేషించడం లేదు. మార్స్ పై సూక్ష్మజీవుల ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. బిలియన్ల సంవత్సరాల క్రితం జీవించి ఉండవచ్చు లేదా  ఇప్పటికీ జీవించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

నీటి సంకేతాలు: 

స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ లాంటా నాసా రోవర్లు ఒకప్పుడు మార్స్ మీద ద్రవ నీరు ప్రవహించిందని నమ్మకమైన సంకేతాలను కనుగొన్నాయి. ఎండిన నదులు, బంకమట్టి, సల్ఫేట్‌ల వంటి ఖనిజ నిక్షేపాలు, పురాతన సరస్సులు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. జీవి మనుగడకు నీరు అవసరమని మనకు తెలిసిందే. ఈ కారణంగానే మార్స్ పై ఒకప్పుడు జీవులు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. 

2018లో నాసా క్యూరియాసిటీ రోవర్ 3 బిలియన్ సంవత్సరాల నాటి మార్టిన్ రాక్‌లో సేంద్రీయ అణువులను గుర్తించింది. ఇవి గ్రహంపై జీవనం ఉందని రుజువు కాకపోయినా, సేంద్రీయ సమ్మేళనాలు జీవి ఏర్పరచడానికి అవసరమైన ప్రాథమిక పదార్థాలు. 

మీథేన్ స్పైక్స్: గాలిలో ఒక రహస్యం

భూమిపై, మీథేన్ ఎక్కువగా జీవుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. క్యూరియాసిటీ, భూమి ఆధారిత టెలిస్కోప్‌లు మీథేన్ స్థాయిలను గమనించాయి. దీంతో ఈ మీథెయిన్ కు బహుశా జీవసంబంధమైన మూలం కారణంగా అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని భౌగోళిక ప్రక్రియలు కూడా మీథేన్‌ను విడుదల చేయగలవు, కాబట్టి జీవి మనుగడపై ఇంకా స్పష్టత రాలేదు. 

నాసా పర్సెవెరెన్స్ రోవర్, ప్రస్తుతం జెజెరో క్రేటర్ మార్స్ పై ఒకప్పుడు ఉన్న సరస్సు కోసం అన్వేషిస్తోంది. మార్స్ గ్రహంపై రాతి, నేల నమూనాలను సేకరిస్తోంది. ఈ నమూనాల ద్వారా మార్స్ పై జీవి మనుగడకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించేందుకు ఇది ఉపయోగపడనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్
Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే