ఫేస్‌బుక్ క్రేజ్ ముగిసిందా: తగ్గుతున్న వినియోగదారులు..గత 18 ఏళ్లలో మొదటిసారి ఎదురుదెబ్బ..

By asianet news telugu  |  First Published Feb 3, 2022, 11:29 PM IST

గత 18 సంవత్సరాల ఉనికిలో మొట్టమొదటిసారిగా ఫేస్ బుక్ మొత్తం డైలీ యాక్టివ్ యూజర్ల (DAU)సంఖ్య పడిపోయింది. ఫేస్‌బుక్  మాతృ సంస్థ మెటా నెట్‌వర్క్స్ డిసెంబరు చివరి మూడు నెలల్లో డైలీ యాక్టివ్ యూజర్లు 1.929 బిలియన్లకు క్షీణించాయని, గత త్రైమాసికంలో 1.930 బిలియన్ల నుండి పడిపోయిందని నివేదించింది. 


సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (meta) గత 18 ఏళ్లలో తొలిసారిగా భారీ నష్టాన్ని చవిచూసింది. అయితే మెటా వినియోగదారుల సంఖ్య నిరంతరం తగ్గుతుండటం  ఇందుకు కారణమని దీంతో  యాడ్ బిజినెస్ లో నష్టం వాటిల్లుతోందని సంస్థ వెల్లడించింది. మెటా విడుదల చేసిన ఈ  సమాచారం తర్వాత కంపెనీ షేర్లు 22 శాతం పడిపోయాయి.

అలాగే కంపెనీ లాభాలు 10.3 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 77,106 కోట్ల మేర తగ్గిందని ఒక నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం గత త్రైమాసికంలో ప్రతిరోజూ 1 మిలియన్ డైలీ ఆక్టివ్ యూజర్ల(DAU) తగ్గుదల ఏర్పడింది, ఈ కారణంగా కంపెనీ భారీ నష్టాన్ని చూసింది. మెటా  ఈ ప్రకటన తరువాత కంపెనీ మార్కెట్ విలువ  200 బిలియన్ల డాలర్లు తగ్గింది.

Latest Videos

undefined

కంపెనీ గత త్రైమాసికం నుండి 1.95 బిలియన్ డైలీ ఆక్టివ్ యూజర్లను ఆశించింది, అయితే ఈ సంఖ్య 1.93 బిలియన్ల వద్దనే ఆగిపోయింది. దాని అంచనాల ప్రకారం మెటా 33.67 బిలియన్లు డాలర్లు లేదా దాదాపు రూ. 2,52,051 కోట్ల వ్యాపారం చేసింది. అయితే నాల్గవ త్రైమాసికంలో మెటా నికర లాభం 10.3 బిలియన్లు అంటే సుమారు 77,106 కోట్లుగా నివేదించింది, అయితే ఈ గణాంకాలు గత సంవత్సరం కంటే ఎనిమిది శాతం తక్కువ.

మెటా కూడా యాపిల్ వల్ల ప్రభావితమవుతున్నట్లు  ఓ ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం ఆపిల్ ప్రైవసీ ఫీచర్‌ను విడుదల చేసింది, దీంతో వినియోగదారుడి అనుమతి లేకుండా ఏ యాప్ ఫోన్‌ను యాక్సెస్ చేయలేదు. ఈ ఫీచర్‌తో ఐఫోన్ వినియోగదారులు తమ డేటాపై మరింత కంట్రోల్ పొందుతారు, కాబట్టి ఫేస్‌బుక్ ట్రాక్ చేయలేకపోయింది. టిక్‌టాక్, యూట్యూబ్ వంటి సంస్థల నుండి పెరిగిన పోటీ కారణంగా అలాగే ప్రకటనకర్తలు ఖర్చుపై వెనక్కి తగ్గడం వల్ల ఆదాయ వృద్ధి క్షీణించవచ్చని కంపెనీ తెలిపింది.

ఫేస్ బుజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్  వినియోగదారులు ముఖ్యంగా యువత ఫేస్ బుక్  పోటీ ఉన్న యాప్స్ కి మారినందున కంపెనీ సేల్స్ వృద్ధికి ఆటంకం ఏర్పడిందని హైలైట్ చేశారు. ఫేస్‌బుక్‌తో పాటు ట్రేడింగ్‌లో ట్విట్టర్, స్నాప్, అలాగే పిన్ ఇంట్రెస్ట్ వంటి ఇతర పోటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల షేర్లు కూడా పడిపోయాయి. 

 గూగుల్ తర్వాత ప్రపంచంలోని రెండవ అతిపెద్ద డిజిటల్ అడ్వర్టైజింగ్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న మెటా సంస్థ ఆపిల్  ఆపరేటింగ్ సిస్టమ్  గోప్యతా మార్పుల ద్వారా కూడా ప్రభావితమైందని పేర్కొంది.  

click me!