తేల్చేసిన ఇన్ఫీ: నో ఎవిడెన్స్ ఆన్ ప్రజా వేగు కంప్లైంట్స్

By Sandra Ashok KumarFirst Published Nov 5, 2019, 12:05 PM IST
Highlights

ప్రజా వేగుల పేరిట సంస్థ సీఈఓ, సీఎఫ్ఓలపై చేసిన ఫిర్యాదులపై ఆధారాలే లేవని ఇన్ఫోసిస్ తేల్చేసింది. అయితే దర్యాప్తు కొనసాగుతుందని, ఆధారాలు లభిస్తే చర్యలు తప్పవని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)కి ఇచ్చిన వివరణలో తెలిపింది. మరోవైపు సెబీ కూడా దీనిపై సమాచారాన్ని సేకరిస్తున్నది.

బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో పెనుదుమారం రేపిన ప్రజా వేగు ఫిర్యాదు ఆరోపణలు నిరాధారమని తెలిపింది. కంపెనీ సీఈవో, సీఎఫ్‌వోపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇన్ఫోసిస్‌ సోమవారం తెలిపింది. దీనిపై పరిశోధన జరుగుతోందని ఆధారాలు లభించిన వెంటనే దర్యాప్తు ప్రక్రియ ముమ్మరం చేసేందుకు ఆడిట్‌ కమిటీ సిద్ధంగా ఉందని పేర్కొంది.

సంస్థ ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇప్పటివరకు మాకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లభించలేదు అని ఇన్ఫీ అని జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)కి రాసిన లేఖలో తెలిపింది. అయితే, ఫిర్యాదులపై ఇంకా విచారణ కొనసాగుతోందని తెలిపింది. 

కంపెనీపై అందిన ఫిర్యాదుల విశ్వసనీయత, కచ్చితత్వం, వాస్తవికతను కంపెనీ తేల్చలేకపోతోందని లేఖలో సంస్థ పేర్కొంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న విచారణ వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్‌ ఎక్సేంజీలకు తెలియజేస్తూ వస్తామని ఇన్ఫోసిస్‌ తెలిపింది. దీనిపై యూఎస్‌ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సంస్థ స్టాక్‌ మార్కెట్లకు తెలిపింది. 

also read అమేజాన్ యాప్ వాడుతున్నారా...అయితే మీకో గుడ్ న్యూస్

ఉద్యోగులు రాసిన లేఖను తమ దృష్టికి తీసుకురాకపోవడంపై వివరణ ఇవ్వాలని ఇన్ఫోసిస్ సంస్థపై ఎన్‌ఎస్‌ఈ కన్నెర్ర చేసింది. వివరణ ఇవ్వాలని గత నెల 24వ తేదీన ఆదేశించింది. దీనిపై స్పందించిన ఇన్ఫోసిస్‌ తాజాగా తన వివరణను తెలిపింది. దీనిపై సెబీ కూడా సమాచార సేకరణలోనే నిమగ్నమైంది. కంపెనీ తాజా ప్రకటనతో ఇన్ఫోసిస్‌ షేర్లు పుంజుకున్నాయి. ఒక దశలో ఇన్ఫీ షేర్ ధర 6.5శాతం మేర పెరిగింది. 

కాగా 'నైతిక ఉద్యోగులు', 'ప్రజావేగులు'గా తమకు తాము చెప్పుకున్న ఆ బృందం ఇందుకు సంబంధించి సాక్ష్యాలుగా పలు ఈమెయిళ్లు, వాయిస్‌ రికార్డులు ఉన్నట్లు తెలిపిన సంగతి గురించి ఇన్ఫోసిస్‌ తన వివరణలో పేర్కొనకపోవడం విశేషం. రానున్న రోజుల్లో ఇందుకు సంబంధించిన వివరణలను వెలువడే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై విచారణ కోసం శార్దుల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కో న్యాయ సంస్థను ఇన్ఫీ ఆడిట్‌ కమిటీ నియమించుకున్నది. స్వతంత్ర అంతర్గత ఆడిటర్‌తోనూ కమిటీ సంప్రదిస్తున్నది. సీఈవో పరేఖ్‌ అనైతిక పద్ధతులను అనుసరించడమేగాక, వాటిని సమర్థించుకున్నారని గుర్తు తెలియని ఉద్యోగులు బోర్డుకు రాసిన లేఖలో వివరించిన సంగతి తెలిసిందే.

also read యాపిల్ తో సమరానికి గూగుల్ 'సై'...

భారీ ఒప్పందాల్లో నిబంధనల అతిక్రమణ జరిగిందని, సమీక్షలు, అనుమతులు, సూచనలు లేకుండానే డీల్స్‌కు పరేఖ్‌ ఆమోదం తెలిపారని ఉద్యోగులు వెల్లడించారు. ఆడిటర్లు, బోర్డు నుంచి కీలక సమాచారాన్ని దాచిపెట్టారని, వెరిజోన్‌, ఇంటెల్‌ ఒప్పందాలతోపాటు జపాన్‌లో జాయింట్‌ వెంచర్లు, ఏబీఎన్‌ ఆమ్రో కొనుగోలు లావాదేవీలేవీ సక్రమంగా జరుగలేదని, అకౌంటింగ్‌ ప్రమాణాలను పాటించలేదని పేర్కొన్నారు.

కాగా, తాము చెప్పేదంతా నిజమని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని లేఖలో నాడు ఉద్యోగులు స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ-మెయిల్స్‌, వాయిస్‌ రికార్డులున్నాయనీ 

click me!