ఐవా ఈ సేల్‌లో ఐవా మాగ్నిఫిక్ టివి సిరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. 32-అంగుళాల మోడల్ ధర రూ. 29,999, 65-అంగుళాల (4K UHD) మోడల్ ధర రూ. 1,39,990. అయితే ఈ సేల్‌లో 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
జపనీస్ బ్రాండ్ ఐవా కస్టమర్లకు భారీ గిఫ్ట్స్ అందిస్తూ బిగ్ దీపావళి సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో ప్రీమియం క్వాలిటీ స్పీకర్‌లు, మాగ్నిఫిక్ రేంజ్‌తో కూడిన హై పర్ఫర్మెంస్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లను గొప్ప ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో, కస్టమర్‌లు మాల్దీవుల ట్రిప్ 40 శాతం తగ్గింపుతో అలాగే రూ. 50 లక్షల వరకు గిఫ్ట్ గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. ఐవా బిగ్ దీపావళి సేల్ 2022 ప్రారంభమై అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. మీరు కూడా దీపావళి రోజున కొత్త టీవీ, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మీకు మంచి అవకాశం. ఈ సేల్‌లో లభించే ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం...
ఐవా మాగ్నిఫిక్ టీవీ సిరీస్
ఐవా ఈ సేల్‌లో ఐవా మాగ్నిఫిక్ టివి సిరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. 32-అంగుళాల మోడల్ ధర రూ. 29,999, 65-అంగుళాల (4K UHD) మోడల్ ధర రూ. 1,39,990. అయితే ఈ సేల్‌లో 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ సిరీస్‌లో 55-అంగుళాల, 65-అంగుళాల మోడల్‌లు బెస్ట్ ఆడియో అనుభవం కోసం ఇంటర్నల్ సౌండ్‌బార్‌తో వస్తాయి.
ఆండ్రాయిడ్ 11 స్మార్ట్ టీవీలో ఇచ్చారు. అంతేకాకుండా, ఐవా మాగ్నిఫిక్ సిరీస్‌లోని అన్ని టీవీలలో క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంది. అన్ని టీవీ సిరీస్‌లతో పాటు వచ్చే రిమోట్‌లో వాయిస్ కమాండ్‌లు ఉంటాయి ఇంకా టీవీలో Google అసిస్టెంట్ కూడా అందించారు. స్మార్ట్ టీవీతో HDR 10 ప్లస్‌కి క్రిస్టా టెక్ విజన్ సపోర్ట్ ఉంది. టీవీ డిస్‌ప్లేతో యాంటీ గ్లేర్, మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్ సపోర్ట్ లభిస్తుంది.
ఐవా స్పీకర్
ఐవా బిగ్ దీపావళి సేల్‌లో కస్టమర్‌లు స్పీకర్‌లపై 15% నుండి 28% తగ్గింపు ఇస్తుంది. ఐవా హై-ఫిడిలిటీ బ్లూటూత్ స్పీకర్లు ఆడియోఫైల్స్, మ్యూజిక్ ప్రియులకు మంచి ఆప్షన్. ఇది పోర్టబుల్ అండ్ హై-పవర్ రీఛార్జిబుల్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి దీనిని ఇండోర్ అలాగే అవుట్‌డోర్ కోసం ఉపయోగించవచ్చు.
లక్కీ డ్రా గెలుచుకునే అవకాశం
ఐవా బిగ్ దీపావళి సేల్‌లో కస్టమర్‌లు కొనుగోళ్లపై తగ్గింపులతో పాటు లక్కీ డ్రాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. దీని కోసం కస్టమర్లు ఐవా రిటైల్ స్టోర్ లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. కస్టమర్‌లు మాల్దీవుల ట్రిప్, రూ. 50 లక్షల వరకు గిఫ్ట్ గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు.