కూ యాప్ ఇక గుడ్ బై.. నాలుగేళ్ల పోరాటం తర్వాత కీలక నిర్ణయం..

By Ashok KumarFirst Published Jul 3, 2024, 5:55 PM IST
Highlights

పార్ట్నర్ షిప్ చర్చలు విఫలం కావడం, హై టెక్నాలజీ  ఖర్చుల కారణంగా కూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మూసివేయనున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు. అయితే ఏప్రిల్ 2023 నుండి కంపెనీ ఉద్యోగులను కూడా తగ్గించడం ప్రారంభించింది. 
 

ఇండియన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కూ(Koo) యాప్ చివరికి మూతపడబోతోంది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Twitter (ఇప్పుడు X)కి పోటీగా వచ్చింది. కూ యాప్ ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిడవత్కా యాప్ షట్ డౌన్ గురించి తెలిపారు. ఒకప్పుడు రాజకీయ నాయకుల నుంచి మంత్రుల వరకు చాలా మంది వీఐపీలు కూడా ‘కూ’ యాప్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు.

పార్ట్నర్ షిప్ చర్చలు విఫలం కావడం, హై టెక్నాలజీ  ఖర్చుల కారణంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మూసివేయనున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు. అయితే ఏప్రిల్ 2023 నుండి కంపెనీ ఉద్యోగులను కూడా తగ్గించడం ప్రారంభించింది. 

యాక్టివ్ యూజర్లు కోటి మంది... 
కూ యాప్ డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 21 లక్షలకు చేరుకున్న రోజులు  ఉన్నాయి. అంతే  కాదు, కంపెనీ  ప్రతినెలా యాక్టివ్ యూజర్ల  సంఖ్య కోటికి కూడా చేరుకుంది. కూ యాప్ లో  9 వేల మంది వీఐపీలకు అకౌంట్స్  ఉన్నాయి. ఈ యాప్ లో రాజకీయ నాయకులు కూడా చాలా పోస్ట్స్ చేశారు. 

ఒకానొక సమయంలో చాలా మంది నేతలు, కేబినెట్ మంత్రులు కూ యాప్ అఫీషియల్ అకౌంట్స్  కూడా క్రియేట్ చేసుకున్నారు. ఈ యాప్ ఇండియన్  ట్విట్టర్‌గా ప్రచారం జరిగింది. అయితే, ఇంత విజయం సాధించినప్పటికీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సంస్థ చివరికి వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. 

యాప్ ఎందుకు ఆగిపోయింది?
టెక్నాలజీ పై ఖర్చులు, ఊహించని మార్కెట్ క్యాపిటల్ ‘కూ’ యాప్ మూసివేతకు కారణమని వ్యవస్థాపకులు పేర్కొన్నారు. దీనితో పాటు, వ్యవస్థాపకులు కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను విక్రయించాలని ఆసక్తి చూపిస్తున్నారు. వ్యవస్థాపకుడు విడుదల చేసిన నోట్‌లో.. ‘భారతీయ సోషల్ మీడియాలో ఏదైనా గొప్పగా చేయాలని ఆలోచిస్తున్న వారితో ఈ ఆస్తులను పంచుకోవడం మాకు సంతోషంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ఈ యాప్  ట్విట్టర్‌కి ప్రత్యక్ష పోటీలో ఉంది. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పుడు, ఈ యాప్  యూజర్ల సంఖ్య పెరిగింది. దీనిపై ‘కూ’ వ్యవస్థాపకులు  మాట్లాడుతూ, మేము తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా స్కేల్ చేయగల ప్రోడక్ట్ నిర్మించామని పోస్ట్ చేశారు.

click me!