త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్లలో ఆగిపోనున్న వాట్సాప్.. లిస్టులో మీ ఫోన్ ఉందా..?

By Ashok KumarFirst Published Jul 3, 2024, 5:47 PM IST
Highlights

మనం వాట్సాప్‌పై ఎంతగానో ఆధారపడుతున్నాం. అయితే త్వరలో 35 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం నిలిచిపోనుంది. ఈ 35 ఫోన్ మోడల్స్  ఏంటి ? ఈ లిస్టులో మీ ఫోన్ మోడల్ కూడా ఉందో లేదో చెక్  చేసుకోండి.
 

న్యూఢిల్లీ: ఇండియాలో వాట్సాప్ చాలా మంది ప్రజల జీవితాల్లో భాగమైంది. ఆఫీస్, ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్, స్కూల్ & కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్ ద్వారా కనెక్టయి  ఉంటున్నారు. ఇదే వాట్సాప్ ద్వారా  ఆఫీస్ పనులు, కమ్యూనికేషన్స్, మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అయితే, ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. త్వరలో 35 స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్ లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోనుంది. కెనాల్ టెక్ నివేదిక ప్రకారం, Samsung, Motorola, Apple, Sony, LG సహా కొన్ని బ్రాండ్‌లకు చెందిన 35 స్మార్ట్‌ఫోన్‌లలో WhatsApp సపోర్ట్ నిలిపివేసింది.

తాజాగా వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెట్టింది. వీటిని పాత సెక్యూరిటీ ఫీచర్లకు అప్ డేట్ గా తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వాట్సాప్ కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఈ కొత్త అప్‌డేట్‌కు సపోర్ట్ ఇవ్వవు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 5.0 వెర్షన్, ఆపిల్ ఐఫోన్ ఐఓఎస్ 12 వెర్షన్, అలాగే పాత వెర్షన్ ఫోన్‌లకు ఈ కొత్త ఫీచర్లు సపోర్ట్ చేయవు. దీంతో వాట్సాప్ పనిచేయడం  ఆగిపోతుంది.

Latest Videos

Samsung Galaxy Note 3, Galaxy S3 Mini, Galaxy S4 Mini, Motorola Moto G, Moto X, Apple బ్రాండ్ iPhone 6, iPhone SE మోడల్‌తో సహా కొన్ని ప్రముఖ మోడల్ ఫోన్లలో WhatsApp అప్‌డేట్ సపోర్ట్  లేదు. యూజర్లు వారి ఫోన్‌లో WhatsAppను ఉపయోగించాలంటే, అప్‌డేట్ కావాలి. అంటే అప్ డేట్ స్మాట్ ఫోన్ కి మారాల్సి ఉంటుంది. 

Samsung: Galaxy Ace Plus, Galaxy Core, Galaxy Express 2, Galaxy Grand, Galaxy Note 3, Galaxy S3 Mini, Galaxy S4 Active, Galaxy S4 Mini, Galaxy S4 జూమ్.
Apple: iPhone 5, iPhone 6, iPhone 6S, iPhone 6S Plus, iPhone SE.
Huawei: Ascend P6S, Ascend G525, Huawei C199, Huawei GX1S, Huawei Y625
Lenovo: Lenovo 46600, Lenovo A858T, Lenovo P70, Lenovo S890
Sony: Xperia Z4G Optimus G, Optimus G3 L7

click me!