ఈ సేల్‌లో వివిధ రకాల భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. అంతేకాదు ఆకర్షణీయమైన ఆఫర్లు, బెస్ట్ EMI అప్షన్స్ ప్లాన్‌లు కూడా ఉంటాయి. మరోవైపు అమెజాన్ ఎకో డివైజ్లు భారీ డిస్కౌంట్‌తో లభిస్తాయి.
ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఈ నెల (జూలై) 20న ప్రారంభం కానున్నాయి. ప్రైమ్ డే సేల్ అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలవుతుంది. రెండు రోజులపాటు సాగే ఈ సేల్‌ను ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ కస్టమర్‌ల కోసం తీసుకొచ్చింది. ఈ సేల్‌లో వివిధ రకాల భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. అంతేకాదు ఆకర్షణీయమైన ఆఫర్లు, బెస్ట్ EMI అప్షన్స్ ప్లాన్‌లు కూడా ఉంటాయి. మరోవైపు అమెజాన్ ఎకో డివైజ్లు భారీ డిస్కౌంట్‌తో లభిస్తాయి. కాగా, ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీల్లో జరగనుంది.
Intel, Samsung, OnePlus, Iqoo, Honor, Sony, Asus లాంటి ఇండియన్ & ఫారెన్ బ్రాండ్‌లతో సహా 450 కంటే ఎక్కువ బ్రాండ్‌లు సేల్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
ఈ సేల్‌లో SBI, ICICI బ్యాంక్ కార్డ్స్ & క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సక్షన్స్ పై 10% డిస్కౌంట్... అలాగే, Amazon ICICI క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ వెల్‌కమ్ రివార్డ్స్‌గా రూ.2500, ప్రైమ్ కస్టమర్‌లు రూ.300 క్యాష్‌బ్యాక్ అండ్ రూ. 2,200 వరకు రివార్డ్స్ పొందవచ్చు. ప్రైమ్ మెంబర్‌లు ఇంకా 30 రోజుల ఉచిత ట్రయల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారు ఈ ఆఫర్స్ పొందుతారు.
అయితే, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కి నెలకు రూ.299, మూడు నెలలకు రూ.599, ఏడాదికి రూ.1499. అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ ధర రూ.399. ఫాస్ట్ డెలివరీతో పాటు, ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, మ్యూజిక్ ఇంకా ప్రైమ్ రీడింగ్‌ను కూడా పొందవచ్చు.