లాక్‌డౌన్‍తో యూట్యూబ్ వీడియో క్వాలిటీ తగ్గింపు.. మిగతా వాటిదీ అదే దారి

By narsimha lodeFirst Published Mar 31, 2020, 11:02 AM IST
Highlights

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. కొన్ని రోజులు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఒకవేళ అత్యవసర పనులపై బయటకు వెళితే, ఇతరులకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. కొన్ని రోజులు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఒకవేళ అత్యవసర పనులపై బయటకు వెళితే, ఇతరులకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చునని పేర్కొంటున్నారు. ఫలితంగా ప్రజలంతా ఇళ్లకు పరిమితం అయ్యారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో ఎవరూ ఇంటి నుంచి బయటకు రావడం లేదు. 

ఇళ్లలో ఉండే వారి వినోదానికి మార్గం టెలివిజన్, మొబైల్ ఫోన్. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కొద్ది రోజులుగా భారతదేశంతోపాటు ప్రపంచ దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. తత్ఫలితంగా యూట్యూబ్‌తోపాటు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల వేదికపై సినిమాలు, వినోద కార్యక్రమాలను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 

ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో యూ ట్యూబ్‌ను వీక్షించే వారి సంఖ్య పెరుగుతుండటంతో బ్యాండ్ విడ్త్ సమస్యలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూ-ట్యూబ్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నది. మొబైల్ ఫ్లాట్ ఫామ్ వేదికగా అన్ని రకాల వీడియో క్వాలిటీని 480 పిక్సెల్‌కు తగ్గించి వేసింది. 

అయితే, డెస్క్ టాప్ వర్షన్‌లో యూ-ట్యూబ్ ఎటువంటి నిబంధనను విధించలేదు. ఎప్పటి మాదిరిగానే వినియోగదారులకు తమకు అవసరమైన నాణ్యతలోనే వీడియోలు వీక్షించొచ్చు. ఇదే బాటలో నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ కూడా ప్రయాణిస్తాయి. 

Also read:కొన్ని సిటీల్లో అమెజాన్ సేవలు షురూ: ఈ-రిటైలర్లకు రూ.7500 కోట్ల లాస్

గత వారమే మొబైల్స్‌లో వీడియోల సామర్థ్యాన్ని 480 పిక్సెల్స్‌కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్నెట్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే భారత్‌లో వీడియోలను ఆండ్రాయిడ్‌ మొబైల్‌లలో వీక్షించే యూజర్లకు క్వాలిటీని 480 పిక్సల్‌లకు యూట్యూబ్‌ తగ్గించింది. ఏ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నా ఆండ్రాయిడ్‌ మొబైల్‌లలో క్వాలిటీ 480 పిక్సల్‌లకు మించి ప్లే అ‍వ్వడం లేదు.
 

click me!