కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. ఈ సమయంలో ఫేస్‌బుక్ లైవ్ వీడియోలకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. కరోనావైరస్ సమాచారం కోసం చాలా మంది ఈ లైవ్‌వీడియోలను చూస్తున్నారు
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. ఈ సమయంలో ఫేస్‌బుక్ లైవ్ వీడియోలకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. కరోనావైరస్ సమాచారం కోసం చాలా మంది ఈ లైవ్‌వీడియోలను చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోలను ఫేస్‌బుక్ ఖాతాలేని వారు చూసేందుకు వీలుండేది కాదు.
అయితే ఇప్పుడు ఖాతా లేకున్నా లైవ్ వీడియోలను వీక్షించేలా ఫేస్‌బుక్ సరికొత్త వసతిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే డెస్క్‌టాప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు తాజాగా అందుబాటులోకి వచ్చింది.
త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్ బుక్ కృషి చేస్తోంది. మరో వారంరోజుల్లో ఐఓఎస్ యూజర్లకు ఈ వసతి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. దీంతోపాటు పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్అనే ఓ సరికొత్త వసతిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కాల్ నెంబర్ ద్వారా లైవ్‌స్ట్రీమ్‌ల ఆడియోలు ఫోన్‌ద్వారా వినొచ్చు.
ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఫేస్‌బుక్ వినియోగం అధికం అవుతోంది. 70 శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు గ్రూప్ వీడియో కాల్స్ చేయడం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లను వీక్షించటానికి సమయం వెచ్చిస్తున్నారు.
Also read:మహీంద్రా ముందడుగు: నేటి నుంచి ఫేస్‌షీల్డ్ తయారీ
ఈ కారణంగా ఇంటర్నెట్ వినియోగంపై భారాన్ని తగ్గించేందుకు భారత్, లాటిన్ అమెరికాల్లో వీడియో నాణ్యతను తగ్గిస్తున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ప్రకటించాయి. లైవ్ స్ట్రీమ్ ఫీచర్ ఆండ్రాయిడ్ వసతి గల స్మార్ట్ ఫోన్లలో ఇప్పటికే లభిస్తున్నది. దీన్ని ఐఓఎస్ ఫోన్లకు విస్తరించనున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది.