‘పేటీఎం’ ఫ్రీడమ్ క్యాష్ బ్యాక్ ఆఫర్

First Published 9, Aug 2018, 1:50 PM IST
Highlights

ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్‌ కోర్‌ ఐ3, 4జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌, ఏడాది పాటు యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌​ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్‌ 320 ధర పేటీఎం మాల్‌లో రూ.22,490కు తగ్గింది. 

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ-కామర్స్ సంస్థలన్నీ వరసబెట్టి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమేజాన్, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లు భారీ ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలోకి పేటీఎం కూడా వచ్చి చేరింది.

‘ఫ్రీడమ్ క్యాష్ బ్యాక్’ పేరిట పేటీఎం మాల్ ఆఫర్ ప్రకటించింది. ఈ సేల్‌ ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. పేటీఎం మాల్‌ ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్‌ కోర్‌ ఐ3, 4జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌, ఏడాది పాటు యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌​ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్‌ 320 ధర పేటీఎం మాల్‌లో రూ.22,490కు తగ్గింది. అదేవిధంగా ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌ కలిగిన డెల్‌ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్‌ 6000 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. 

ఎంఎస్‌ఐ జీఎల్‌63 8ఆర్‌ఈ-455ఐఎన్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్‌ తన కస్టమర్లకు ఆఫర్‌ చేస్తోంది. 13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎంక్యూడీ42హెచ్‌ఎన్‌/ ల్యాప్‌టాప్‌పై కస్టమర్లకు అందుతుంది. మైక్రోసాఫ్ట్‌ సర్‌ఫేస్‌ ప్రొ కోర్‌ ఐ5 ల్యాప్‌టాప్‌పై 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంది. 

అంతేకాక, ఆపిల్‌, హెచ్‌పీ, ఏసర్‌ వంటి పలు ప్రముఖ బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. పైన పేర్కొన్న ఆఫర్లు మాత్రమే కాక, మిడ్‌నైట్‌ సూపర్‌ డీల్స్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పేటీఎం మాల్‌ ఆఫర్‌ చేస్తోంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి కూడా ఫ్లాష్‌ సేల్స్‌, అద్భుతమైన డీల్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ఐసీఐసీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా పేమెంట్లు జరుపుతారో, వారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్టు పేటీఎం మాల్‌ తెలిపింది.

Last Updated 9, Aug 2018, 1:50 PM IST